Srihari Rao is the President of DCC: నిర్మల్, డిసెంబర్ 21 (మన బలగం): ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు శనివారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ పండితులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని అన్నారు. ఇందులో ఆలయ కమిటీ చైర్మన్ కొండ శ్రీనివాస్, ధర్మకర్తలు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది, పట్టణ అధ్యక్షులు నందెడపు చిన్ను, కౌన్సిలర్లు శనిగారపు నరేష్, సోన్, దిలావర్పూర్, మామడ నర్సాపూర్ మండల అధ్యక్షులు మధుకర్ రెడ్డి, సాగర్ రెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, లక్ష్మంచంద జెడ్ పి టి సి ఓస రాజేశ్వర్, నిమ్మ సాయన్న, అరుగుల రమణ, కటకం రాజారెడ్డి, కొట్టె శేఖర్, సబా కలీం, కొంతం గణేష్, అంగూరు మహేందర్ ఈసవేని మనోజ్, చిన్నయ్య, గుల్లే రాజన్న మేకల నరేష్ తదితరులు పాల్గొన్నారు.