Savitribai Phule Jayanti: ధర్మపురి, జనవరి 3 (మన బలగం): ధర్మపురి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం అంబేద్కర్ సంఘాల అధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘాల నాయకుడు చిలుమూరు లక్ష్మణ్ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి దారి చూపిన మార్గదర్శి, కుల వివక్ష, పితృస్వామిక పీడలపై పోరాడిన వీరనారి సావిత్రిబాయి ఫూలే అని తెలిపారు. విద్యతోనే వనితకు విముక్తి సాధ్యమన్న సామాజిక సంస్కర్త అని చెప్పారు. భారత మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా బహుజనుల పాలిట చదువుల తల్లి సరస్వతి అని కొనియాడారు. కార్యక్రమంలో దాసరి పురుషోత్తం, రాందేని మొగిలి, దుర్గం రవీందర్, బొల్లారం పోచయ్య, చందోలి శ్రీనివాస్, బాదినేని వెంకటేశ్, బరిగేల ప్రశాంత్, నరేశ్, శివ, శ్రీను, మరియు తదితరులు పాల్గొన్నారు.