దివ్యనగర్లో వైభవంగా బోనాల ఊరేగింపు, పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి కవిత
Bonalu Festival Celebrations at Divyanagar with MLA’s Wife Kavitha Participation: బోనమో దుర్గమ్మ.. మమ్ము చల్లంగా చూడు తల్లి.. ప్రతీ ఏడు నీ మొక్కలు తీర్చుకుంటున్నాము.. మా భారం నీదే తల్లి అంటూ దివ్యనగర్ కాలనీ వాసులు వైభవంగా బోనాల ఉత్సవాలను నిర్వహించారు. ఆదివారం ఉదయం కాలనీలోని దుర్గ మాత మండపం నుండి ప్రారంభమైన బోనాల ఉత్సవాలు కాలనీలోని ప్రధాన వీధిలో గుండా సాగి మల్లన్న గుట్ట పై గల మల్లన్న ఆలయం లో సమర్పించారు.నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి కవితమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.కాలనీ అభివృద్ధి కమిటీ నాయకులు పురస్తు శంకర్,గడుదాస్ రమేష్,నరేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి,రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొని బోనాల ఏర్పాట్లు చేశారు.మహిళలు ఏలేటి ప్రవీణా రెడ్డి,దాసారం కరుణ,వంగ ప్రగతి, కొరిపెల్లి అనిత తో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
