Bathukamma video contest Nirmal
Bathukamma video contest Nirmal

Bathukamma video contest Nirmal: బతుకమ్మ వీడియోలకు ప్రోత్సాహకాలు

Bathukamma video contest Nirmal: జిల్లాలో జరుగుతున్న బతుకమ్మ సంబరాలను మరింత ఉత్సాహభరితంగా మార్చేందుకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలు, బతుకమ్మ గ్రూపులు తీసిన వీడియోలను కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌కి పంపితే, అందులో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి ప్రోత్సాహకాలు అందజేస్తామని కలెక్టర్ ప్రకటించారు. రెండు నిమిషాల లోపు నిడివి గల హై క్వాలిటీ వీడియోలను ఈ నెల 30లోగా పంపాలని సూచించారు. ఎంపికైన వీడియోలను జిల్లా అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్టు చేస్తామని తెలిపారు. ఆసక్తి గల వారు తమ వీడియోలను వాట్సాప్ నంబర్ 91005 77132 కి పంపాలని కోరారు. వీడియో పంపేటప్పుడు వ్యక్తి పేరు లేదా బతుకమ్మ గ్రూప్, సంఘం పేరు, చిరునామా, మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *