ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్
Ambedkar Jayanti: కరీంనగర్, ఏప్రిల్ 14 (మన బలగం): పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ అన్నారు. సోమవారం రోజున అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా కోర్టు చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఎనలేని కృషిచేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఈ సమాజంలో కులం మతం లేదు మనుషులమందరం ఒక్కటే అని, అంటరానితనాన్ని ఎదిరించి కులము అనే పదాన్ని కూకటీ వెల్లతో పెకిలించిన మహానీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు రిజర్వేషన్ కల్పించి ఉన్నత స్థాయికి చేర్చిన గొప్ప మహనీయుడు అంబేద్కర్ అని, ఈ భారత దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని, అందరికీ ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యంలో అందరం సమానమే అని చాటి చెప్పిన మహానేత అంబేద్కర్ అని కొనియాడారు. వారి యొక్క జయంతి సందర్భంగా నేటి తరం యువత, విద్యార్థులు ఎలాంటి అసమానతలు లేకుండా అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం, వారు కన్న కలల కోసం ముందుకు నడవాలని యుగంధర్ యువతకు పిలుపునిచ్చారు.