District level CM Cup
District level CM Cup

District level CM Cup: జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభం

District level CM Cup: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందుతాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. సీఎం కప్ పోటీల్లో భాగంగా ఇటీవల గ్రామస్థాయి, మండల స్థాయి ఆటలు నిర్వహించగా, బుధవారం జిల్లా స్థాయి పోటీల కార్యక్రమాన్ని కలెక్టర్, ఎస్పీ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్తేజ పరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకు వచ్చి, వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూప రెడ్డి, జిల్లా యువజన అండ్ స్పోర్ట్స్ అధికారి రాందాస్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ లావణ్య ఎస్.జి.ఎఫ్. సెక్రటరీ, ప్రభుత్వ, ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *