- నిర్మల్ పట్టణ అభివృద్ధికి రూ.57 కోట్ల నిధుల మంజూరు
- బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్
Nirmal town development funds ₹57 crores: గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి కుంటుపడిన నిర్మల్ పట్టణ అభివృద్ధికి బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కృషితో రూ.57 కోట్ల నిధులు మంజూరు అయినట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మె రాజు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నిర్మల్ పట్టణంలోని అంతర్గత సీసీ రోడ్లు , డ్రైనేజీల నిర్మాణానికి 15 కోట్లు, కేంద్ర ప్రభుత్వ స్వచ్ భారత్ మిషన్ పథకం ద్వారా పట్టణంలో ఎస్టీపీ ప్లాంట్‌ల (మురుగునీటి శుద్ధి కేంద్రాలు)కు 42 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఘనత మహేశ్వర్ రెడ్డికి చెందుతుందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో పట్టణంలోని కాలనీలు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు.
నిర్మల్‌కు దిక్సూచిగా ఉన్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నియోజక అభివృద్ధికి వందల కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నారని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు ఇలా మారుమూల గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని అన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక ఎమ్మెల్యేపై అసత్య, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇకనైన తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి, ఆకుల కార్తీక్, సీనియర్ నాయకులు ఆడెపు సుధాకర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఒడిసెల అర్జున్, తాజా మాజీ కౌన్సిలర్లు చిన్నయ్య, సాదం అరవింద్, శంకరపతి, పద్మాకర్, నాయకులు జింక సూరి, జుట్టు దినేష్ , కొండజి శ్రావణ్, గిల్లి విజయ్, గంజి రాజు, రాజేష్, పుదరి రంజిత్, రవి, తిరుపతి, సంతోష్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.
