- కడెంలో యూరియా కోసం రైతుల ఆందోళన
- సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Farmers protest for urea shortage in Nirmal district: నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు సోమవారం ఆందోళన చేశారు. రైతుల చేస్తున్న ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్ నాయక్ పాల్గొని మద్దతు తెలిపారు. రైతులతో కలిసి పీఏసీఎస్ కేంద్రానికి వెళ్లి అధికారులతో మాట్లాడారు. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతుంటే అధికారులు పట్టించుకోకుండా వ్యవహరించటం సరైంది కాదని ఆగ్రహం చెందారు రేపటిలోగా రైతులకు యూరియా పంపిణీ చేపట్టకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. యూరియా కొరత కారణంగా రైతులు పడుతున్న బాధ వర్ణనాతీతమని ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది అన్నారు. ఎన్నికల్లో రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతుల సమస్యలను పరిష్కరించకపోవడం విచారకరం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై అక్కసు ఉందని, నిర్లక్ష్యానికి నిదర్శనం అని అన్నారు. కార్యక్రమంలో మండల రైతులు మాజీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.