Mala Mahanadu protests Telangana government decisions: మాలలను ప్రభుత్వం పూర్తిగా అణచివేసేందుకు కుట్రలు చేస్తుందని మాల మహానాడు సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ అన్నారు. సోమవారం నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో మాల మహానాడు సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాలలపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సరికాదన్నారు. ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా ప్రభుత్వం అమలు చేయడం జరిగిందని మండిపడ్డారు. అంతేకాకుండా టీఎస్ఆర్టీసీ ఉద్యోగ నోటిఫికేషన్‌లో మాల ఉప కులాలకు కేవలం 28 ఉద్యోగులను కేటాయించడం అనేది మాలల ఉద్యోగ అవకాశాలను నీరుగార్చడానికి నిదర్శనమన్నారు. అలాగే రోస్టర్ పాయింట్లలో 22వ రోస్టర్ పాయింట్ మాలలకి కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.ఈ విషయాలపై రాబోవు రోజుల్లో ప్రతి గ్రామంలో తిరిగి మాలలకు జరుగుతున్న అన్యాయాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మాలలపై తీసుకుంటున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుంటోల్ల వెంకటస్వామి, జిల్లా నాయకులు ఆకుల రమేష్, సతీష్, భూమేష్, సిద్ధార్థ, శ్రీనివాస్ ,రత్నయ్య ,పులి అశోక్, తదితరులు పాల్గొన్నారు.