Padi Puja at Ayyappa Swamy Temple: ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 26 (మన బలగం): స్వామియే శరణం అయ్యప్ప.. హరిహర సుతనే.. శరణం అయ్యప్ప అంటూ ఆ అయ్యప్ప నామస్మరణతో ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్పూర్ గ్రామం మార్మోగింది. గురువారం అయ్యప్ప స్వామి ఆలయంలో పడి పూజ కార్యక్రమంలో భాగంగా స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పుర వీధుల గుండా పల్లకిలో ఊరేగించారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాల దారులు పెటతుల్లి ఆటలతో భక్తి గీతాలతో అలరించారు. అనంతరం మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్వామి వారికి పంచామృతాభిషేకములు నిర్వహించి.. ఘనంగా మెట్లపూజ చేశారు. కార్యక్రమంలో గురుస్వాములు శ్రీనివాస్ స్వామి, ఇంద్రారెడ్డి స్వామి, పలువురు స్వాములు పాల్గొన్నారు.