Khanapur Sharannavaratri celebrations: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తి గ్రామంలో సోమవారం దసరా పర్వదిన వేడుకల సందర్బంగా దుర్గ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అర్చకులు విగ్రహ ప్రతిష్ట చేశారు. అభిషేక, అర్చనలు, ప్రత్యేక పూజలు చేసారు. నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా యువకులు అర్చకులు సతీష్ ఆధ్వర్యంలో భవాని దీక్షలు తీసుకొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. గ్రామప్రజలు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అలాగే ఖానాపూర్ పట్టణంలోని శివాజినగర్‌లో గల మహాలక్ష్మి ఆలయంలో, ముత్యాల పోచమ్మ తల్లి ఆలయంలో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు.