రవాణశాఖలో జూన్ 1 నుంచి కొత్త రూల్స్
New traffic rules: జూన్ 1 తారీఖు నుంచి తెలంగాణలో కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు రవాణా శాఖ ఉన్నతాధికారులు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. నిబంధనలు పాటించకుంటే భారీగా జరిమానాలు సైతం విధించనున్నారు. అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.1000 నుంచి రూ.2000 వరకు జరిమానా విధిస్తారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా వేస్తారు. ముఖ్యంగా మైనర్ (18 సంవత్సరాల లోపు వారు) ఎలాంటి వాహనం నడిపినా రూ.25 వేలు ఫైన్ వేస్తామని అధికారులు హెచ్చరించారు. దాంతో పాటు మైనర్‌కు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధిస్తామంటున్నారు.