Death of a farmer: ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 28 (మన బలగం): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రైతు ఎడ్ల నర్సయ్య (69) తన పొలంలో పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై శనివారం రాత్రి మృత్యువాత పడ్డాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు రైతు నర్సయ్య ఎప్పటిలాగే తన పొలంలో పనులకోసం సాయంత్రం వెళ్ళాడు. అక్కడ పనులు చేస్తున్న నర్సయ్య విద్యుత్ స్థంబానికి సప్పోర్ట్ గ ఉన్న తీగకు విద్యుత్ ప్రసరణ జరగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు సందీప్ ప్రస్తుతం బి ఆర్ ఎస్ పట్టణ శాఖా అధ్యక్షునిగా కొనసాగుతున్నాడు.