- ఏ ఆఫీసులో చేరిందోనని ఆందోళన
- ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్
Jagityal Collectorate: జగిత్యాల, డిసెంబర్ 28 (మన బలగం): జగిత్యాల జిల్లా కలెక్టరెట్‌లో కొండ చిలువ వచ్చిందన్న ప్రచారంతో ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. బుధవారం రాత్రి సమయంలో కలెక్టరేట్ ఔట్ గేట్ నుంచి కొండ చిలువ లోపలికి వస్తుండగా కొందరు ఉద్యోగులు చూసి తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శుక్ర, శనివారాల్లో రెండు రోజులపాటు కలెక్టరేట్ ఉద్యోగుల్లో కొండ చిలువనే ప్రధాన చర్చగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. కొండ చిలువపై రక రకాల ప్రచారాలు షికార్లు కొడుతున్నాయి. కొందరైతే కలెక్టరెట్ లోపలికి చేరిందన్న ప్రచారాలు చేస్తుండగా మరికొందరు లోపలికి వచ్చి బయటకు పొయ్యుండొచ్చు అన్న ముచ్చట్లతో ప్రచారం చేస్తున్నట్టు తెలిసింది. ఇలా ఉద్యోగుల్లో జరుగుతున్న చర్చకుతోడు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాలతో ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్ నెలకొంది. ఏది ఏమైనా కొండ చిలువ వ్యవహారం ముగిసే వరకు ఉద్యోగుల్లో టెన్షన్ తగ్గేలా లేదన్నట్లు ప్రచారం జరుగుతోంది.