KL Rahul: కేఎల్ రాహుల్ లక్నో సూపర్ గెయింట్స్ ఆడే సమయంలో అతడు ధరించే క్యాప్‌పై నంబర్ వన్ అని ఉంటుంది. అయితే ఒక ఈవెంట్‌లో పాల్గొన్న కేఎల్ రాహుల్ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే చెన్నై తరఫున ధోని వికెట్ కీపింగ్ చేసే సమయంలో 1 నంబర్ క్యాప్ ధరిస్తాడు.
నెంబర్ 1 క్యాప్ ఎందుకు ధరిస్తాడు అని అడగ్గా.. అది స్పెషల్ అని చెన్నై తరఫున నంబర్ 1 ప్లేయర్ ధోని అని రిజిస్టర్ చేసుకున్నారని తెలిసింది. ఆ నంబర్ ఎప్పటికీ ఉండిపోతుంది. ఆ తర్వాత ఎంతమంది ఆటగాళ్లు చెన్నైకి ఆడిన వారికి ఆ తర్వాత నంబర్లే దక్కుతాయని అర్థమైంది. దీంతో చెన్నై ధోనిని గౌరవించిన తీరు నచ్చింది.
దీంతో పంజాబ్ నంచి లక్నోకు మారినపుడు కొత్తగా జట్టు ఫ్రాంచైజీలో అడుగుపెట్టింది. ఆ సమయంలో ఫ్రాంచైజీ ఓనర్లను సంప్రదించి లక్నోకు సంబంధించిన నంబర్ 1 క్యాపు నాకు కావాలి. ఈ టీంకు నేనే మొదటి ఆటగాడిగా ఎప్పటికీ ఉండాలని కోరాను. దానికి వారు కూడా ఒప్పుకున్నారు. ప్రస్తుతం నేను కూడా నంబర్ 1 లక్నో క్యాప్ ధరిస్తూ క్రికెట్ ఆడానని తెలిపాడు.
నంబర్ 1 అనే పాజిటివ్ సంఖ్య. మనలో శక్తిని ఉత్తేజాన్ని… విజయాన్ని తెస్తుందని చెప్పాడు. అందుకే చెన్నైకి ధోని ఎలాగో.. లక్నోకు కేఎల్ రాహుల్ అలాగా ఉండాలని నిర్ణయించుకున్నా.. దీనిపై ఎవరు ఎమన్నా మనందరం ఎప్పుడూ పోరాడేది ఆ నంబర్ వన్ స్థానం కోసమే కదా.. అలాంటప్పుడు దాన్ని నేనేందుకు వదులుకుంటానని చెప్పాడు. దీంతో అందరూ చప్పట్లో కేఎల్ రాహుల్‌ను అభినందించారు. కేఎల్ రాహుల్ లక్నోకు కెప్టెన్‌గా వ్యహరించగా.. ఈ ఐపీఎల్ సీజన్‌లో గ్రూపు స్టేజ్‌లోనే ఇంటి ముఖం పట్టింది.