IPL 2024 GT vs DC
IPL 2024 GT vs DC

IPL 2024, GT vs DC: టైటాన్స్‌కు కలిసిరాని టైం

  • గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ
  • 9 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్

IPL 2024, GT vs DC: ఐపీఎల్ 2024‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయాన్ని అందుకున్నది. డీసీకి ఇది వరుసగా రెండో విజయం. బుధవారం జీటీతో జరిగిన మ్యాచులో 6 వికెట్లతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 89 పరుగులకే కుప్ప కూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 9 ఓవర్లలోనే మ్యాచ్‌ను ఫినిష్ చేసింది. స్వల్ప లక్ష్యం కావడంతో క్యాపిటల్స్ రన్‌రేట్ కోసం ధాటిగా ఆడినట్లు అనిపించింది. 4.5 ఓవర్లలోనే 65 పరులకు చేరుకున్నది.

దీంతో మ్యాచ్ 7 ఓవర్లలోనే ముగుస్తుందని అనుకున్నారు. వరువాత డీసీ వరుసగా వికెట్లు సమర్పించుకున్నది. 8.5 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి టార్గెట్‌ను ఛేజ్ చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో మెక్ గుర్క్ (10 బంతుల్లో 20), అభిషేక్ పోరెల్ (7 బంతుల్లో 15), షై హోప్ (10 బంతుల్లో 19), రిషభ్ పంత్ (11 బంతుల్లో 16 రన్స్) రాణించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సందీప్ వారియర్ 2, స్పెన్సర్ జాన్సన్ 1, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఢిల్లీ బౌలర్ల ధాటికి 17.3 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీంతో ఐపీఎల్ 2024 సీజన్‌లో అత్యల్ప స్కోరు నమోదైంది. జట్టు స్కోరు 11 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ (8) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అప్పటి నుంచి జీటీ వికెట్లు కోల్పోయింది. వృద్ధిమాన్ సాహా (2), సాయి సుదర్శన్ (12), డేవిడ్ మిల్లర్ (2), అభినవ్ మనోహర్ (8), షారుక్ ఖాన్ (0) నిరాశ పరిచారు. ఓ దశలో 30/4, 48/6తో నిలిచింది.

రషీద్ ఖాన్ కాస్త ఫర్వాలేదనిపించాడు. 24 బంతుల్లో 31 పరుగులు చేసి.. జట్టు స్కోరును 80 పరుగులు దాటించాడు. చివరకు గుజరాత్ టైటాన్స్.. 89 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాటర్లలో రషీద్ ఖాన్ (31), సాయి సుదర్శన్ (12), రాహుల్ తెవాటియా (10) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, ఇషాంత్ శర్మ 2, ట్రిస్టన్ స్టబ్స్ 2, ఖలీల్ అహ్మద్ 1, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపర్చుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *