- విజృంభించిన బౌలర్లు
- లక్నోపై ఘన విజయం
- 161 పరుగులు చేసిన లక్నో
- 15.4 ఓవర్లలోనే ఛేజ్ చేసిన కేకేఆర్
KKR vs LSG, IPL 2024: కోల్‌కతా లక్నోపై సునాయస విజయాన్ని అందుకున్నది. ఇప్పటి వరకు ఐదు మ్యాచులు ఆడిన కోల్‌కతా నాలుగు మ్యాచుల్లో గెలిచింది. పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. లక్నో మరో పరాజయాన్ని మూటగట్టుకున్నది. ఇప్పటి వరకు ఆరు మ్యాచులు ఆడిన లక్నో మూడు మ్యాచుల్లో గెలిచి మూడు మ్యాచుల్లో ఓడింది. పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
ఐపీఎల్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం 24వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ గేంట్స్ మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో జరిగింది. టాస్ గెలిచి కోల్‌కతా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్‌జీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 161 పారుగులు చేసింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 15.4 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
లక్నో బ్యాటర్స్‌లో పూరన్ 45(32), కెప్టెన్ కేఎల్ రాహుల్ 39(27), ఆయుష్ బదోని 29(27) మాత్రమే చెప్పుకోతగ్గ స్కోర్ చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్లు తీవ్ర నిరాశ పరిశారు. డికాక్, దీపక్ హుడా, స్టోయినిస్, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్ 10 అంతకంటే తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. కోల్‌కతా బౌలర్లలో స్టార్క్ నాలుగు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసాడు. వైభవ్ అరోరా, సునీలర్ నరేన్, చక్రవర్తి, రస్సెల్ తలో వికెట్ తీసారు.
తరువాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా బ్యాటర్లు ధాటిగా ఆడారు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 47 బాల్స్‌లో మూడు సిక్సర్లు, 14 ఫోర్ల సాయంతో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ 38(38) రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. సునీల్ నరేన్ 6(6), రఘువంశీ 7(6) రన్స్ చేశారు. శ్రేయస్ అయ్యర్, సాల్ట్ ఇద్దరూ కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. లక్నో బౌర్లలో మోసిన్ ఖాన్ రెండు వికెట్లు తీసాడు. జోసెఫ్ నాలుగు ఓవర్లలో 47 రన్స్ సమర్పించుకున్నాడు.