NZ vs AFG, T20 World Cup 2024 Highlights: అఫ్గానిస్తాన్ తన కంటే బలమైన న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ టీం ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ న్యూజిలాండ్ బౌలర్లను దాటిగా ఎదుర్కొన్నారు. గుర్జాబ్ 56 బంతుల్లోనే 80 పరుగులు చేశాడు. అయిదు సిక్సులు, అయిదు ఫోర్లతో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇబ్రహీం మూడు ఫోర్లు, రెండు సిక్సులతో 44 పరుగులతో రాణించాడు.
103 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పగా.. మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో 158/6 తో అఫ్గాన్ ఇన్సింగ్స్ ముగించింది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్, మ్యాథ్ హెన్రీ రెండేసి వికెట్లు తీయగా.. లూకీ ఫెర్గూసన్ ఒక వికెట్ తీశాడు. 159 పరుగుల ఛేదనతో బ్యాటింగ్ కు దిగిన కివీస్ కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా బ్యాటర్లు సింగిట్ డిజిట్ కే పరిమితమైనా దారుణంగా విఫలమయ్యారు. దీంతో న్యూజిలాండ్ దారుణ ఓటమి మూటగట్టుకుంది.
అఫ్గానిస్తాన్ బౌలర్లలో ఫజుల్ ఫారూఖీ మరో సారి 4 వికెట్లు తీయగా.. కెప్టెన్ రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు, మహమ్మద్ నబీ రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ ను 15 ఓవర్లలోనే ఆలౌట్ చేశారు. అంతర్జాతీయ టీ 20ల్లో అఫ్గానిస్తాన్ కు ఇదే భారీ విజయం. పెద్ద జట్లపై గెలిచే సత్తా ఉందని అఫ్గాన్ మరోసారి నిరూపించింది. ఫజుల్ ఫరూఖీ మరో సారి నాలుగు వికెట్లతో చెలరేగడంతో అఫ్గాన్ విజయం సులువైంది.
అఫ్గాన్ ఓపెనర్ గుర్జాబ్ మాట్లాడుతూ.. మూడేళ్లుగా ఈ విజయం కోసం ఎదురు చూస్తున్నామన్నాడు. ఈ మ్యాచ్ లో 80 పరుగులు చేసిన గుర్బాజ్ కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఒకే టీ 20 లో ఇప్పటి వరకు ఇద్దరు నాలుగు వికెట్లు తీసిన సందర్భాల్లో ఇది కేవలం మూడోది మాత్రమే.. అంతకు ముందు పాకిస్థాన్ బౌలర్లు షాహిద్ ఆఫ్రిది, ఉమర్ గుల్, రషీద్ ఖాన్, ముజీబ్, ప్రస్తుతం ఈ మ్యాచ్ లో ఫరూఖీ, రషీద్ ఈ ఘనత అందుకున్న వారిలో ఉన్నారు.