IPL 2024 Top Players : 2024 ఐపీఎల్ 17 వ సీజన్ లో అత్యధిక పరుగుల సాధించిన క్రికెటర్ గా విరాట్ కొహ్లి నిలిచాడు. విరాట్ కొహ్లి 741 పరుగులతో ఈ సీజన్ లోనే టాప్ స్కోరర్ గా ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. విరాట్ కొహ్లి లేకపోవడంతో ఆరెంజ్ క్యాప్ ను కోల్ కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీసుకున్నాడు.
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచాడు. పంజాబ్ జట్టు ప్లే ఆప్స్ చేరకుండానే 9 వ స్థానంలో నిలిచినా కూడా హర్షల్ పటేల్ 24 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. పర్పుల్ క్యాప్ గెలుచుకోవడం చూస్తే ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.
సునీల్ నరైన్ 17 వికెట్లు తీయడంతో పాటు 488 పరుగులు చేయడంతో మ్యాన్ ఆప్ ది సిరీస్ అవార్డుకు ఎంపికయ్యాడు. సునీల్ నరైన్ 2012 సీజన్ లో 24 వికెట్లు తీయగా.. 2018 సీజన్ లో బ్యాటింగ్ లో357 పరుగులు 17 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ లో 488 పరుగులు చేసి 17 వికెట్లు తీసిన సునీల్ నరైన్ ను ప్లేయర్ ఆప్ ది సిరీస్ గా ఎంపిక చేయడంతో సంబరాలు చేసుకున్నారు.
పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డును హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గెలుచుకుంది. హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి ఈ సీజన్ లో యంగ్ ఎమర్జింగ్ ప్లేయర్ గా అవార్డు సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో మ్యాచ్ గెలిచి ట్రోపీ సొంతం చేసుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ కు రూ. 20 కోట్ల ప్రైజ్ మనీని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ దుమాల్ అందజేశారు. ఫైనల్ లో ఓడిపోయిన సన్ రైజర్స్ కు రూ. 12.50 కోట్ల చెక్కును కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కు అందించారు.