Shreyas iyer : ఐపీఎల్ 2024లో విజయం సాధించిన తరువాత కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ చైన్నైలోని హోటల్‌లో అర్ధరాత్రి దాటాక సంబురాల్లో మునిగితేలింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ట్రోఫీతో ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా చెలరేగిపోయి ఆడింది. బౌలింగ్‌లో సత్తా చాటిన కోల్‌కతా హైదరాబాద్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసింది. 18.3 ఓవర్లలో 113 పరుగులకే అలౌట్ అయ్యింది.
వెంకటేశ్ అయ్యర్ 52 నాటౌట్‌గా జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 114 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా కేవలం 10.3 ఓవర్లలోనే పూర్తి చేసి చాంపియన్ ట్రోఫీని సగర్వంగా అందుకున్నది.
శ్రేయాస్ చాంపియన్ ట్రోఫీతో డ్యాన్స్ చేస్తూ అభిమానులను అలరించాడు. సంబురాల వీడియోను కోల్‌కతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. విక్టరీ తరువాత ఆండ్రీ రస్సెల్ మైదానంలో కన్నీళ్లు పెట్టాడు. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ఇది మరపురాని మధురమైన క్షణాలు అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
రెహ్మానుల్లా గుర్బాజ్ (39) మూడు క్యాచులతో స్టంప్స్ వెనుక అదరగొట్టాడు. తరువాత బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. కాబూల్ దవాఖానలో చికిత్స పొందుతున్న తన తల్లిని కలిసేందుకు టోర్నమెంటు మధ్యలోనే ఆయన బయలుదేరి వెళ్లాడు. ఇంగ్లిష్ ప్లేయర్ సాల్ట్ జాతీయ డ్యూటీకి రిపోర్ట్ చేసేందుకు వెళ్లగా గర్బాజ్ జట్టులో చేరాడు. గేమ్ ఏకపక్సంగా సాగింది. హైదరాబాద్‌పై ఘన విజయం సాధించడంతో కోల్‌కతా మూడో సారి కప్పు ఎగరేసుకు పోయింది. సమష్టి కృషితో ఆటగాళ్లు రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.