Kavya Maran
Kavya Maran

KAVIYA MARAN: ఎక్కి ఎక్కి ఏడ్చిన కావ్య

KAVIYA MARAN: సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఫైనల్లో ఓడిపోవడంతో టీం ఓనర్ కావ్య మారన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. 18 ఓవర్లకే టీం 113 పరుగులకే ఆలౌట్ అయింది. సెకండ్ బ్యాటింగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించారు.

మొదటి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుని ప్యాట్ కమిన్స్ పొరపాటు చేశాడు. కేవలం 113 పరుగులకే సన్ రైజర్స్ ఆలౌట్ అయింది. వెంకటేశ్ అయ్యర్, రహ్మనుల్లా గుర్బాజ్ ఇద్దరు ఎడాపెడా బౌండరీలు, సిక్సులతో చెలరేగి 10.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను గెలిపించి ఫైనల్లో కోల్‌కతాను విజయ తీరాలకు చేర్చారు.

మొన్నటి మ్యాచ్ వరకు సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఎంతో ధైర్యంగా ఉండేది. మ్యాచ్ ఓడిపోయినా కూడా కన్నీరు పెట్టుకునేది కాదు. సన్ రైజర్స్ ఫైనల్లో ఏ మాత్రం పోటీ ఇవ్వకుండా ఓడిపోయే సరికి కన్నీటిని ఆపుకోలేకపోయింది. కోల్‌కతా గెలుపు సంబురాల్లో మునిగిపోతే కావ్య మాత్రం వెక్కి వెక్కి ఏడ్చింది.

దీంతో స్టేడియంలోనే ఆమె ఏడ్వడం చూసి సన్ రైజర్స్ అభిమానులు ఓదార్చుతున్నారు. మ్యాచుల్లో గెలుపు ఓటములు సహజం. చివరి మెట్టుపై బోల్తా పడినా సన్‌రైజర్స్‌పై ఎప్పటికీ మా అభిమానం కావ్యకు అభిమానులు ధైర్యం చెబుతున్నారు. కావ్య మారన్ ఏడిస్తే తట్టుకోలేమని మీరు ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఫ్రాంచైజీ ఓనర్లు ఓడిపోయినపుడు ఏడ్చిన సందర్భాలు అరుదుగా కూడా కనిపించలేవు. కానీ కావ్య మారన్ ఏడిస్తే మాత్రం సన్ రైజర్స్ అభిమానులు తట్టుకోలేకపోయారు. టీం కోసం ఆటగాళ్లు ఎంతలా కష్టపడ్డారో కావ్య మారన్ కూడా టీం మళ్లీ గెలిచి నిలవాలని చాలా కృషి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *