Sachin comments on SRH
Sachin comments on SRH

Sachin Tendulkar Comments on SRH : వార్ని మీరెంట్రా 300 కూడా కొట్టేలా ఉన్నారూ.. సచిన్ టెండూల్కర్ పోస్ట్

Sachin Tendulkar Comments on SRH : సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్ దిగ్గజం. సచిన్‌కు ముందు సచిన్ తర్వాత ఇండియా లో క్రికెట్ చూడటం ఆడటం అనేవి పెరిగాయని మనందరికీ తెలుసు. ఇండియాలో సచిన్ అంటే గాడ్ ఆఫ్ క్రికెట్ అని తెలుసు. అంతలా దేశంలో క్రికెట్ ఫ్యాన్స్ పెరగడానికి కారణం సచిన్ టెండూల్కర్. అయితే ఏ మ్యాచ్ బాగా జరిగినా, ఎవరు మంచి పర్ఫామెన్స్ కనబర్చినా.. సచిన్ తప్పకుండా ట్విట్టర్ (ఎక్స్)లో పోస్టు చేస్తుంటాడు.

లక్నోతో సన్ రైజర్స్ మ్యాచ్‌లో హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసం చూశాక సచిన్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. వీరు గనక మొదటి బ్యాటింగ్ చేసుంటే 300 స్కోరు చేసి ఉండేవారేమో అని అన్నారు. అయితే ఈ టోర్నీలో ఇప్పటి వరకు సన్ రైజర్స్ 250 ప్లస్ స్కోరు మూడు సార్లు చేసింది. గత సీజన్లలో ఎక్కడ, ఎప్పుడు ఇంత స్కోరు చేసిన దాఖలాలు లేవు.

ఐపీఎల్ సీజన్‌కే హైదరాబాద్ జట్టంటే ప్రత్యేకమైన ప్రేమ కలిగేలా వీరిద్దరి బ్యాటింగ్ చూసేందుకు ఫ్యాన్స్ టీవీల ముందు అతుక్కుపోతున్నారు. ఒకప్పుడు ముంబై, చెన్నై, బెంగళూరు మ్యాచ్‌లకు మాత్రమే ఫ్యాన్స్ ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అనగానే తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఓపెనర్లు ఫామ్‌లో లేకపోతే మిడిలార్డర్‌లో క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి బాధ్యతను భుజాలకెత్తుకుని తమ కర్తవ్యాన్ని నెరవేర్చుతున్నారు. ఇంకో మ్యాచ్ గెలిస్తే చాలు ప్లే ఆఫ్‌కు వెళ్లే చాన్సుంది.

ఈ సీజన్‌లో సన్ రైజర్స్ ఆటగాళ్ల బ్యాటింగ్ తీరును క్రికెట్ దిగ్గజాలు ప్రశంసిస్తున్నారు. సన్ రైజర్స్ మాజీ కోట్ టామ్ మూడీ అభిషేక్ శర్మ జన్యూన్ ప్లేయర్ అని అలవోకగా సిక్సులు కొట్టగలడని ప్రశంసించాడు. సచిన్ టెండూల్కర్ 300 స్కోరు దాటే వారేమో అంటూ ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపాడు. సన్ రైజర్స్‌కు ఇంతలా ఊపు వచ్చింది ఎప్పుడూ లేదు. ఈ సారి కప్ కొట్టే అన్ని అర్హతలు ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది సన్ రైజర్సే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *