SRH vs RCB 2024 : సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి రికార్డు బ్రేక్ స్కోరుతో రాయల్స్ చాలెంజర్స్ బౌలర్లపై దండయాత్ర చేసింది. మొత్తం 22 సిక్సులు, 19 ఫోర్లతో రాయల్స్ బౌలర్లను తుత్తునియలు చేశారు. 287 పరుగులతో వీర విహారం చేశారు. స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులను ఉర్రూతలుగించారు. సన్ రైజర్స్ బ్యాటర్ హెడ్ సెంచరీ (102) తో చెలరేగగా.. క్లాసెన్ 7 సిక్సులతో 64 పరుగులు చేసి బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశారు.
దినేశ్ కార్తీక్ కా దిమాక్ మే వరల్డ్ కప్ చల్ రహే అన్నట్లు నేనేం తక్కువ కాదన్నట్లు 35 బంతుల్లోనే 83 పరుగులు చేసి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ను గెలిపించినంత పని చేశాడు. క్లాసెన్, హెడ్, అభిషేక్ శర్మ, సమద్ విధ్వంసం సృష్టిస్తే విరాట్, డుప్లెసిస్, దినేశ్ కార్తీక్ కూడా తాము తక్కువ కాదన్నట్లు బంతి పడితే చాలు బౌండరీ దాటించుడే పని పెట్టుకున్నారు.
ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్ లో 250 పరుగుల కంటే ఎక్కువ పరుగులు సాధించిన మ్యాచ్ లు మూడు ఉన్నాయి. అందులో సన్ రైజర్స్ రెండు సార్లు 277, 287 పరుగులు ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై చేయగా.. ఢిల్లీ పై కోల్ కతా నైట్ రైడర్స్ 270 పరుగులు చేసి రికార్డును నెలకొల్పగా.. ముంబయి ఈసారి 236 పరుగులు చేసింది. ఇలా ఈసారి ఐపీఎల్ లో 200 పరుగులు చేసినా కూడా ఆ మ్యాచ్ లు సప్పగా సాగుతున్నాయి.
అయ్యే అంతేనా 180, 190 చేస్తే అనే టైం వచ్చింది. 180, 190 రన్స్ మ్యాచ్ లు బోర్ కొట్టిస్తున్నాయి. ఇలా 250 పరుగుల పైనే రన్స్ చేస్తేనే మ్యాచ్ పై ఇంట్రస్ట్ వచ్చేలా చేసేశారు సన్ రైజర్స్ బ్యాటర్లు. ఏంటీ బౌలర్లు అంటే లెక్కే లేదా? ఇలా అయితే ఎలా అంటూ చాలా మంది సీనియర్ క్రికెటర్లు బౌలింగ్ పిచ్ లు తయారు చేయాలని కోరుతున్నారు.