- బెంగళూరుపై ఘన విజయం
- 25 పరుగుల తేడాతో విక్టరీ
- ట్రావిస్ హెడ్ సెంచరీ
- క్లాసెన్ హాఫ్ సెంచరీ
- ఆర్సీబీతో మ్యాచ్‌లో భారీ స్కోర్
- ఎస్ఆర్‌హెచ్ రికార్డు స్కోరు 287
- 267 పరుగులకే పరిమితమైన బెంగళూరు
- ఆర్సీబీకి మరో ఓటమి
- ఏడు మ్యాచుల్లో గెలిచింది ఒక్కటే
- పాయింట్స్ టేబుల్‌లో లాస్ట్ ప్లేస్
- సన్నగిల్లిన ప్లేఆఫ్ ఆశలు
IPL 2024 SRH vs RCB: బెంగళూరులో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిసింది.. పరుగుల వరద పారింది. హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 287 పరుగులు చేసింది. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఐపీఎల్ 2024 సీజన్ 30వ మ్యాచ్ బెంగళూరు చినస్వామి స్టేడియంలో సోమవారం ఆర్సీబీ, హైదరాబాద్ తలపడ్డాయి. టాస్ గెలిచిన బెంగళూరు ఎస్ఆర్‌హెచ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆది నుంచే దూకుడుగా ఆడిన ఎస్ఆర్‌హెచ్ భారీ స్కోరు నమోదు చేసింది. ట్రావెన్ హెడ్, అభిషేక్ శర్మ మొదటి వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 165 పరుగుల వద్ద హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయింది.
హెడ్ 102 పరుగులు చేసి ఔట్ అయ్యారు. 41 బాల్స్‌లో 8 సిక్సులు, 9 ఫోర్లతో చెలరేగిపోయాడు. ఆకాశమే హద్దుగా ఆడాడు. భారీ షాట్లతో ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోసాడు. ఏ బౌలర్‌ను లెక్క చేయకుండా సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో కేవలం 15 ఓవర్లలోనే హైదరాబాద్ 205 పరుగులకు చేరుకుంది. హెడ్ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన మార్కక్రమ్, క్లాసెన్ ధాటిగా ఆడారు. 16 ఓవర్లలోనే 217 పరుగులకు చేరుకుంది. క్లాసెన్ 67 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఏకంగా 7 సిక్సులు బాదాడు. 17 ఓవర్లలోనే 231 పరుగులు చేరుకున్నది. 19 ఓవర్లలో 266 పరుగులకు చేరుకుంది. చివర్లలో మార్క్‌క్రమ్, అబ్దుల్ సమద్ రెచ్చిపోయి ఆడారు. సమద్ కేవలం 10 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి. మార్క్‌క్రమ్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 32 పరుగులు చేశాడు.
తరువాత బ్యాటింగుకు దిగిన ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కొహ్లీ, కెప్టెన్ డుప్లెసిస్ ధాటిగా ఆటను ప్రారంభించారు. కొహ్లీ 42(20) మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. 100 పరుగుల వద్ద విల్ జాక్స్7(4) రనౌట్ అయ్యాడు. 111 పరుగుల వద్ద పటిదార్ 9(5) అవుట్ అయ్యాడు. 121 పరుగుల వద్ద బెంగళూరు మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ డెప్లెసిస్ 62(28) పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ వెంటను 122 పరుగుల వద్ద సౌరవ్ చౌహాన్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్, లోమ్‌రార్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. కొండత లక్ష్యం ఉండడంతో ఛేదన అసంభవంగా మారింది. ప్రతి ఓవర్‌కు చేయాల్సిన రన్ రేట్ పెరగడంతో ఓటమికి చేరువైంది.
దినేశ్ కార్తిక్ ఒంటరి పోరాటం చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. లోమ్రార్ 19(11) పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన అనుజ్ రావత్ దినేశ్ కార్తిక్‌కు మంచి సహకారం అందించాడు. 17 ఓవర్లలో 216 పరుగులకు చేరుకుంది ఆర్సీబీ. 83 పరుగులు చేసి దినేశ్ కార్తీక్ ఔట్ అయ్యాడు. 35 బంతుల్లో 7 సిక్సులు, 5 ఫోర్లు బాదాడు. అంజు రావత్ 25(14), విజయ్ కుమార్ 1(2) పరుగులు చేశారు. 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 262 పరుగులు చేసింది. హైదరాబాద్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడిన బెంగళూరు కేవలం ఒక్క మ్యాచులోనే గెలుపొందింది. ఆరు మ్యాచుల్లో పరాజయం పాలైంది. తప్పని సరి గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు చేజేతులా ఓటమి పాలైంది. హైదరాబాద్ బ్యాటర్ల ప్రతాపానికి బౌలర్లు అడ్డుకట్ట వేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మూడు ఓవర్లు వేసిన జాక్స్ 32 పరుగులు, టోప్లి నాలుగు ఓవర్లు వేసి 68 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసాడు. యష్ దయాల్ నాలుగు ఓవర్లలో 51 పరుగులు, ఫెర్గుసన్ నాలుగు ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసాడు. విజయ్ కుమార్ నాలుగు ఓవర్లలో 64 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క ఓవర్ వేసిన లోమ్రార్ 18 పరుగులు ఇచ్చాడు.