prize money one lakh dollars: రాబోయే టీ 20 వరల్డ్ కప్ గెలిస్తే పాకిస్థాన్ టీంలోని ఒక్కో ప్లేయర్‌కు లక్ష డాలర్ల ప్రైజ్ మనీ ఇస్తామని పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వి ప్రకటించారు. 2009లో టీ 20 వరల్డ్ కప్ గెలిచిన పాక్ ఇప్పటి వరకు మళ్లీ ఆ టైటిల్‌ను అందుకోలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా పాక్‌ను గెలిపించాలని ఆ దేశ క్రికెటర్లకు ఆర్మీ ట్రైనింగ్ ఇప్పించారు.
వన్డే వరల్డ్ కప్‌లో దారుణమైన ప్రదర్శనతో కనీసం సెమీఫైనల్ కూడా చేరుకోలేకపోయింది పాక్ టీం. దీంతో పాక్ మాజీ క్రికెటర్లు, అభిమానులు పాక్ క్రికెటర్లపై, పీసీబీపై విమర్శలు చేశారు. పాక్ క్రికెట్ సెలక్షన్ బోర్డు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లనే పాక్ క్రికెట్ టీం ఓడిపోయిందని తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో చీఫ్ సెలక్టర్‌గా ఉన్న ఇంజమామ్ ఉల్ హక్ రాజీనామా చేశారు.
అనంతరం పాకిస్థాన్ టీంకు కెప్టెన్ బాబర్ రిజైన్ చేయగా.. కొత్త కెప్టెన్‌తో ఆస్ట్రేలియా టూర్‌కు పంపించారు. ఆస్ట్రేలియా టూర్‌లో కూడా టెస్టుల్లో పాక్ బ్యాటర్లు, బౌలర్లు తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో తప్పని పరిస్థితుల్లో మళ్లీ బాబర్ అజంకే కెప్టెన్సీ అప్పగించారు. అయితే పాక్ ప్లేయర్లందరూ స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఫిట్‌నెస్ మెరుగు పడేందుకు ఆర్మీ శిక్షణ ఇప్పించారు.
ప్రస్తుతం పాక్ క్రికెట్‌కు వైట్ బాల్ కోచ్‌గా గ్యారీ క్రిస్టియన్‌ను నియమించుకున్నారు. ఈయన గతంలో 2011 లో టీం ఇండియా వరల్డ్ కప్ గెలిచిన టీంకు కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ కోచ్‌గా ఆయనకు మంచి పేరుంది. ఈ సారి ఎలాగైనా పాక్ టీ 20 వరల్డ్ కప్ విజయం సాధించి పాక్ క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటుంది. వరల్డ్ కప్‌కు ముందుకు ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లతో టీ 20 సిరీస్‌లు ఆడనుండటం పాక్‌కు కలిసొచ్చే అంశం.