PACK CRICKTER MUHAMMAD AMIR: పాకిస్థాన్(PAKISTAN) క్రికెటర్ మహమ్మద్ అమిర్ పాకిస్థాన్ క్రికెట్‌లో పునరాగమనం చేయనున్నాడు. పాకిస్థాన్‌లో న్యూజిలాండ్‌తో జరగబోయే అయిదు టీ 20ల మ్యాచ్ సిరీస్ కోసం 17 మందితో ప్రాబబుల్స్ లిస్టులో అమిర్ పేరు ప్రకటించారు. అయితే మహమ్మద్ అమిర్ గతంలోనే పాకిస్థాన్ జాతీయ జట్టుకు ఆడనని రిటర్మైంట్ ప్రకటించాడు. కానీ దేశ, విదేశీ టీ 20 లీగ్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పెద్దలు మహమ్మద్ అమిర్ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని సూచించారు. అమిర్‌తో పాటు రిటైర్మెంట్ ప్రకటించిన మరో ఆల్ రౌండర్ ఇమాద్ వాసింకు సైతం ప్రాబబుల్స్‌లో చోటు దక్కింది. అమిర్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో పొసగక 2020 డిసెంబర్‌లో రిటైర్మెంట్ ప్రకటించారు.
భారత్‌పై రికార్డులు
ప్రస్తుతం 31 ఏండ్లు ఉన్న అమిర్‌కు భారత్‌పై మంచి రికార్డు ఉంది. 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ ఫైనల్లో ఇండియాపై చెలరేగిపోయాడు. శిఖర్ ధావన్, విరాట్ కొహ్లి, రోహిత్ శర్మ వికెట్లు తీసి భారత్ ఓటమికి కారణమయ్యాడు. అమిర్ ఇండియా(INDIA)తో ఆడిన రెండు టీ 20ల్లో మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టాడు. పదునైన అవుట్ స్వింగర్లు, ఇన్ స్వింగర్లు వేయడం అమిర్ (amir) బలం . కాగా.. రాబోయే టీ 20 ప్రపంచ కప్‌లో భారత్‌కు అమిర్ రూపంలో గట్టి పోటీ ఎదురుకానుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి పునరాగమనం చేసిన క్రికెటర్లలో చాలా మంది గతంలో లాగా ఆడిన సందర్భాలు లేవు.. మరి అమిర్, ఇమాద్ వాసింలు ఏ మేరకు రాణిస్తారో న్యూజిలాండ్‌తో(NUZILAND) ఐదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో తేలిపోనుంది.