Sanju stormed at the Empires in a fit of rage: ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా సాగుతున్న సమయంలో సంజు శాంసన్ ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. 16వ ఓవర్‌లో సంజు శాంసన్ ముఖేశ్ కుమార్ బౌలింగ్ సిక్సు కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ బౌండరీ లైన్ వద్ద షై హోప్ అద్భతమైన క్యాచ్ అందుకున్నాడు. కానీ ఎంపైర్లు దాన్ని థర్డ్ ఎంపైర్‌కు నివేదించారు.
థర్డ్ ఎంపైర్ దాన్ని పరిశీలించి సంజును ఔట్‌గా ప్రకటించాడు. అయితే సంజు ఔటైన్నట్లు స్పష్టంగా తెలియలేదు. రివ్యూ పరిశీలిస్తున్నప్పుడు షై హోప్ బౌండరీ లైన్‌ను తాకినట్లు ఒక వైపు నుంచి కనిపిస్తే మరో వైపు నుంచి తాకనట్లు కనిపించింది. అయితే థర్డ్ ఎంపైర్ దీన్ని ఔట్‌గా ప్రకటించారు.
ఈ తతంగం అంతా బిగ్ స్క్రీన్‌లో చూస్తున్న వారందరూ ఎంపైర్ నిర్ణయంపై ఉత్కంఠ ఎదురు చూశారు. కానీ ఎంపైర్ ఔటివ్వడంతో ఒక్కసారిగా సంజు శాంసన్‌కు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎంపైర్ పైకి దూసుకెళ్లి కళ్లు కనిపిస్తున్నాయా లేదా.. ఒక్కసారి మళ్లీ రివ్యూ చేయండి. నేను కెప్టెన్‌ను కదా.. మళ్లీ రివ్యూ తీసుకుంటా అంటూ ఎంపైర్లతో వాగ్వాదానికి దిగాదు. దీంతో గ్రౌండ్‌లో కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సంజు క్రీజులో ఉన్నంత సేపు రాజస్థాన్ రాయల్స్ గెలిచేలా కనిపించింది. సంజు 86 పరుగుల వద్ద అవుట్ కావడంతో రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది.
అయితే సంజు ప్రవర్తనపై బీసీసీఐ, ఐపీఎల్ రూల్స్ ప్రకారం.. జరిమానా విధించింది. అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సంజు శాంసన్ ఓవర్ రేట్ కారణంగా 12 లక్షల జరిమానా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఎంపైర్ల ఆగ్రహానికి గురై మరో 30 శాతం జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అది ఔటా.. నాటౌటా అనేది మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.