IPL 2024 CHAHAL
IPL 2024 CHAHAL

Yuzvendra Chahal: చాహల్ ఏందయ్యా నీకు బ్యాట్ల పిచ్చి

Yuzvendra Chahal: యుజ్వేంద్ర చాహల్ ఇండియా టీంలో లెగ్ స్పిన్నర్. చాహల్ ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. చాహల్ మొదట ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్, రాయల్స్ చాలెంజర్ బెంగళూరు తరఫున ఆడాడు. ఆ తర్వాత అతడిని వేలంలో రాజస్థాన్ రాయల్స్ కొనుక్కోవడంతో రాజస్థాన్‌కు తరలిపోయాడు. మొదట ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఆడగా.. అక్కడ మూడేళ్ల పాటు అతడికి సరైన చాన్స్‌లు రాలేదు.

అనంతరం 2014లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి చాహల్ తలరాత మారిపోయింది. చాహల్ అంతర్జాతీయ టీ 20లో ఆరు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా గుర్తింపు పొందాడు. 2021 టీం వరల్డ్ కప్, 2023 వరల్డ్ కప్‌లో చాన్స్ రాకపోవడంతో ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో కెంట్ జట్టు తరఫున సైన్ చేశాడు.

చాహల్ తన చిన్నతనంలో చెస్ ఆడేవాడు. ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్ షిప్‌లో అతడు పాల్గొన్నాడు. చాహల్ టీవీ పేరుతో సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తూ విశేషాలను పంచుకుంటాడు. ముంబయి ఇండియన్స్ టీం తోటి ఆటగాడు తనను హోటల్ రూం బాల్కనీ నుంచి వేలాడదీశాడని అప్పుడు ప్రాణం పోయినంత పనైందని చెప్పాడు. కానీ అతడెవరో చెప్పలేదు. చాహల్ ధనశ్రీ అనే కొరియోగ్రాఫర్, యూట్యూబర్‌ను 2022లో పెళ్లి చేసుకున్నాడు.

ఎప్పుడూ చలాకీగా ఉండే చాహల్ ఎవరైనా బ్యాట్ పట్టుకుని కనిపిస్తే చాలు వారి నుంచి బ్యాట్ తీసుకుని సరదాగా షాట్లు ప్రాక్టీస్ చేస్తుంటాడు. గతంలో న్యూజిలాండ్ బ్యాటర్ డారెల్ మిచెల్ బ్యాటు తీసుకుని చాలా సేపు ఇవ్వలేదు. మ్యాచ్ అనంతరం అందరూ షేక్ హ్యాండ్స్ ఇవ్వడం అయిపోయిన తర్వాతే అతడికి బ్యాట్ ఇచ్చాడు. ఐపీఎల్ మ్యాచ్‌లో విరాట్ కొహ్లి బ్యాట్ తీసుకుని కాసేపు ఆట పట్టించాడు. గుజరాత్‌తో మ్యాచ్‌కు ముందు రాహుల్ తెవాటియా బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు వెళుతుంటే అతడి వద్ద ఉన్న ఓ బ్యాట్ తీసుకుని ఏదో షాట్లు కొట్టినట్లు చేశాడు. తెవాటియా బ్యాట్ ఇవ్వమని అడగ్గా ఇవ్వకపోవడంతో చాహల్ జుట్టు పట్టీ మరీ బ్యాట్ లాగేసుకున్నాడు. లెగ్ స్పిన్నర్ అయినా నీకు వేరే వాళ్ల బ్యాట్లు అంటే నీకెందుకు అంతా పిచ్చి అనుకుంటూ చాహల్‌ను ఆటపట్టిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *