IPL 2024 DECOCK: ఎంఎస్ ధోనీ అంటే భారత క్రికెట్ అభిమానులకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి ధోనీ ఐపీఎల్లో చివరి సారి కనిపించబోతున్నాడని అందరూ అనుకుంటున్నారు. దీంతో ఎక్కడ మ్యాచ్ జరిగినా చెన్నై జెర్సీలతో స్టేడియంలో నిండిపోతున్నారు. చెన్నై అభిమానులుగా మారిపోతున్నారు. ధోనీ కూడా ఫ్యాన్స్‌ను ఏ మాత్రం హర్ట్ చేయడం లేదు. చివర్లో వచ్చి సిక్సుల మోత మోగిస్తున్నాడు.
ధోనీ లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రెండు ఓవర్లు ఉన్న సమయంలో ఎనిమిదో నెంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగాడు. 9 బంతుల్లోనే మూడు సిక్సులు, రెండు ఫోర్లలో 28 పరుగులు చేశాడు. ధోనీ డగౌట్ నుంచి క్రీజ్‌లోకి వచ్చే సమయంలో ప్రేక్షకులు గట్టిగా ‘ధోనీ.. ధోనీ..’ అని అరిచారు. దీంతో స్టేడియంలో శబ్ధ తీవ్రత భారీగా పెరిగింది. ‘ధోనీ.. ధోనీ..’ అని అరవడం వల్ల లక్నో బ్యాటర్ డికాక్ భార్య తట్టుకోలేకపోయింది. మరికొన్ని నిమిషాలు ఇలాగే అరిస్తే తన చెవులు పగిలిపోయేలా ఉన్నాయని.. ధోనీ రాక ముందు, వచ్చిన తర్వాత ఎంత డెసిబుల్స్ పెరిగిందో తన స్మార్ట్ వాచ్‌ను చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మరో పది నిమిషాలు ఇలాగే అరిస్తే చెవుడు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది.
దీంతో ఫ్యాన్స్ ఊరుకుంటారా. ధోనీ అంటే అట్లుంటది మరీ అని తెగ సంబరపడిపోతున్నారు. దాదాపు ధోనీ క్రీజులోకి వచ్చే సమయంలో 95 డెసిబెల్స్ శబ్ధ తీవ్రత వచ్చిందంటే మామూలు మాటలు కాదు. తమ అభిమాన క్రీడాకారుడు మళ్లీ కనిపించడనే కుతూహలం ఒక వైపు.. ధోనీని ఒక్క సారైనా గ్రౌండ్లో చూడాలనే అభిమానం, పిచ్చి మరో వైపు… ఇలా అభిమానులను అరిచేలా చేస్తున్నాయి. అయితే లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ బాగానే ఆడినా.. చెన్నై బౌలర్లపై కేఎల్ రాహుల్, డికాక్ సమయోచిత ఇన్సింగ్స్ ఆడారు. వీరిద్దరూ ఔటైనా.. చివర్లో పూరన్ సిక్సులతో లక్నోను గెలిపించారు.