differences between Rohit Sharma and Hardik : టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ హర్దిక్ పాండ్యాను టీ 20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేయొద్దని సెలక్టర్లకు సూచించినట్లు ఓ జాతీయ మీడియా వెబ్‌సైట్ కథనాలు ప్రచురించింది. రోహిత్ శర్మ టీం ఇండియాకు మూడు ఫార్మాట్లతో కెప్టెన్ కాగా.. హర్దిక్ ఆల్ రౌండర్‌గా జట్టులో కొనసాగుతున్నాడు. అయితే ఐపీఎల్ సీజన్‌కు ముందు ముంబయి ఇండియన్స్ టీం యాజమాన్యం రోహిత్ శర్మను కాదని హర్దిక్ పాండ్యాకు ముంబయి పగ్గాలు అప్పజెప్పింది.
అప్పటి నుంచి రోహిత్ శర్మ, హార్దిక్ మధ్య విభేదాలు కొనసాగుతన్నట్లు సమాచారం. ముంబయి డ్రెస్సింగ్ రూంలో కూడా రెండు వర్గాలుగా విడిపోయినట్లు వార్తలు వినిపించాయి. ముంబయి యాజమాన్యం ఒక్కొక్కరిని పిలిపించుకుని మాట్లాడగా.. తాత్కాలికంగా సమస్య సద్దుమణిగింది. కాగా టీ 20 వరల్డ్ కప్ అమెరికా, వెస్టిండీస్‌లో జరగనుంది. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ పొట్టి ప్రపంచ కప్‌కు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ టీంను ఎంపిక చేసింది.
ఈ ఎంపికలో హార్దిక్ పాండ్యాను వద్దని రోహిత్ చెప్పినట్లు తెలుస్తోంది. ఫామ్‌లో లేని హార్దిక్‌ను జట్టులోకి తీసుకోవడం రోహిత్‌కు ఇష్టం లేదంటా. ముంబయి టీంలో హార్దిక్ ఒంటెద్దు పోకడలతో విసిగిపోయిన రోహిత్ హార్దిక్‌ను వద్దన్నట్లు సమాచారం. కానీ టీం ఇండియా క్రికెట్‌కు సరైన పేస్ ఆల్ రౌండర్ లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో హార్దిక్‌ను తీసుకున్నట్లు అజిత్ అగార్కర్ తెలిపాడు.
వీరిద్దరి మధ్య గొడవ కాస్త టీం ఇండియా క్రికెట్‌లో బేదాభ్రిప్రాయాలకు తావివ్వకుండా చూడాలి. హార్దిక్‌ను టీ 20 వైస్ కెప్టెన్‌గా చేసిన సెలక్షన్ కమిటీ అందరూ కలిసి ఆడేలా మంచి వాతావరణం కల్పించాలి. లేకపోతే అది కాస్త టీం ఇండియా క్రికెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలా కాకుండా చూడాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుతున్నారు.