Chaminda Vaas lashed out at IPL management: ఐపీఎల్ 2024 సీజన్‌లో తీసుకొచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానంతో టీ20 కాస్త బ్యాటర్ గేమ్‌గా మారిపోయిందని శ్రీలంకన్ వెటరన్ పేస్ బౌలర్ చమిందా వాస్ విమర్శించారు. శ్రీలంకలో జరిగిన పాత్ వే టు క్రికెటింగ్ ఎక్స్‌లెన్స్ అనే పుసక్త ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న చమిందా వాస్ ఐపీఎల్ ఇంపాక్ట్ విధానంపై విరుచుకుపడ్డాడు.
మీరు ఇష్టమొచ్చినట్లు రూల్స్ మార్చుకుని క్రికెట్‌ను బ్యాటర్ల గేమ్‌గా మార్చితే బౌలర్ల పరిస్థితి ఏంటని ఐపీఎల్ యాజమాన్యంపై దుమ్మెత్తిపోశాడు. చమిందా వాస్ ఐపీఎల్‌లో దక్కన్ చార్జర్స్ తరఫున 2008 నుంచి 10 వరకు ఆడాడు. 13 మ్యాచుల్లో పాల్గొన్న చమిందా వాస్ 18 వికెట్లు తీశాడు. ఎకానమీ 7.5తో ఆకట్టుకున్నాడు. చమిందా వాస్ శ్రీలంక పేస్ విభాగానికి ప్రధాన బౌలర్‌గా వ్యవహరించేవాడు. 111 టెస్టులు, 322 వన్డేలు, 5 టీ 20లు ఆడిన వాస్ శ్రీలంకకు ఎన్నో విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. చమిందా వాస్ రిటైర్డ్ అయిన తర్వాత శ్రీలంకకు అంతటి ప్రధాన పేస్ బౌలర్ దొరకలేదు.
ఈ ఇంపాక్ట్ విధానంపై వాస్ స్పందించగా.. ఇప్పటికే టీ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇంపాక్ట్ విధానం వల్ల ఆల్ రౌండర్లకు నష్టం కలుగుతుందని.. శివం దూబె, వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్లకు బౌలింగ్ వేసే చాన్స్ రాకపోతే టీం ఇండియాకే కష్టమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఈ ఇంపాక్ట్ విధానంపై రవి శాస్త్రి మాత్రం మద్దతు ప్రకటించాడు. దీని వల్లే ఈ ఐపీఎల్‌లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయని ఒక ఎక్స్‌ట్రా ప్లేయర్‌కు అవకాశం వస్తుందని చెప్పాడు. ఈ ఇంపాక్ట్ విధానం వల్ల ఐపీఎల్‌లో ఇప్పటికే 250 ప్లస్ స్కోర్లు నమోదయ్యాయి.