Rain is an obstacle for the Chennai vs RCB match: బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో శనివారం జరగబోయే కీలక పోరుకు వరుణుడు అడ్డంకిగా మారనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ 14 పాయింట్లతో మెరుగైన రన్ రేట్‌తో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. ఆర్సీబీ 12 పాయింట్లతో ఉంది. ఈ దశలో కచ్చితంగా మ్యాచ్ జరిగి మెరుగైన రన్ రేట్‌తో గెలిస్తేనే ఆర్సీబీ ప్లే ఆఫ్‌కు చేరుకుటుంది.
మొదట బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో.. ఛేజింగ్‌లో 18.1 ఓవర్లలోనే గెలవాలి. ఇవన్నీ లెక్కలతో కూడుకుని ఉంటే శనివారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ సూచనలతో ఆర్సీబీకి లేని తలనొప్పి వచ్చి పడింది. ఇప్పటికే ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్ ఓడి తర్వాతి మ్యాచ్ గెలిచిన ఆర్సీబీ.. వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడిపోయి ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించినట్లే కనిపించింది. కానీ అనుహ్యంగా తర్వాతి అయిదు మ్యాచుల్లో గెలిచి 12 పాయింట్లు సాధించడమే కాకుండా పోగొట్టుకున్న రన్ రేట్‌ను తిరిగి రాబట్టుకుని ప్లే ఆఫ్ రేసులో నిలిచింది.