America vs Canada, T20 World Cup 2024: టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా డల్లాస్ లోని గ్రాండ్ ప్యారీ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచులో కెనడాపై యూఎస్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అమెరికా కు కెనడా ఓపెనర్లు దూకుడు బ్యాటింగ్ తో బెంబెలెత్తించారు. మొదటి బంతికే ఫోర్ తో స్టార్ట్ చేసిన కెనడా ఓపెనర్ ఆరోన్ జాన్సన్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ 5 ఫోర్లు బాదాడు. 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ కాగా.. 5 ఓవర్లకే 43 పరుగులు చేసి మొదటి వికెట్ కోల్పోయింది.
మరో ఓపెనర్ నవనీత్ దలివాల్ 66 పరుగులు చేశాడు. ఆరు ఫోర్లు, 3 సిక్సుల సాయంతో మెరుపు ఇన్సింగ్స్ ఆడాడు. నికోలస్ కార్టన్, శ్రేయస్ మొవ్వా దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో కెనడా ఇన్సింగ్స్ చివరకు 194/5 తో ఫస్ట్ ఇన్సింగ్స్ ముగించింది. యూఎస్ బౌలర్లలో హర్మీత్ సింగ్, కోరె అండర్సన్, మహమ్మద్ అలీ ఖాన్ ఒక్కో వికెట్ తీయగా.. ఇద్దరు రనౌట్ అయ్యారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన అమెరికాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా స్టార్ ఓపెనర్ టేలర్ రెండో బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. కెప్టెన్ మోనాంక్ పటేల్ 16 పరుగులకే ఔట్ కాగా.. 42 పరుగులతో 2 వికెట్లతో కష్టాల్లో పడింది. ఈ సమయంలో వనడౌన్ బ్యాట్స్ మెన్ అండ్రీస్ గౌస్, ఫోర్త్ డౌన్ బ్యాట్స్ మెన్ అరోన్ జోన్స్ సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. అరోన్ జోన్స్ ఏకంగా 10 సిక్సులు, 4 ఫోర్లతో 94 పరుగులు చేసి మ్యాచును గెలిపించాడు.
అండ్రీ గౌస్ 65 పరుగులతో రాణించాడు. ఏడు ఫోర్లు, మూడు సిక్సుల సాయంతో 65 పరుగులు చేశాడు. దీంతో అమెరికా తన మొదటి వరల్డ్ కప్ మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. 94 పరుగులు చేసిన ఆరోమ్ జోన్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.