Australia vs Oman Highlights, T20 World Cup 2024: బార్బడోస్(Barbados)లో జరిగిన ఆస్ట్రేలియా(Australia), ఓమన్(Oman) మ్యాచ్‌లో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేయగా.. ఫామ్‌లో ఉన్న ట్రావిస్ హెడ్‌ను 12 పరుగులకే ఔట్ చేశారు. మ్యాక్స్‌వెల్(Maxwell)ను 0 పరుగులకే ఔట్ చేయగా.. ఫామ్ లేమి కొట్టొచ్చినట్లు కనిపించింది.
ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) హాఫ్ సెంచరీలో రాణించగా.. మార్కస్ స్టోయినిస్ (Marcus) ఆరు సిక్సులు బాది 67 పరుగులు చేశాడు. దీంతో ఆసీస్ 164/5తో ఇన్సింగ్ ముగించింది. ఓమన్ బౌలర్లలో మెహ్రన్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. కరిముల్లా, బిలాల్ ఖాన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
అనంతరం 165 టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన ఓమన్ బ్యాటర్లు ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయారు. ఆరు పరుగులకే మొదటి వికెట్ కోల్పోగా.. 34 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి ఓమన్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఆచి తూచి ఆడిన బ్యాటర్లు గెలిచేందుకు కాకుండా స్కోరు అంతరాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారు.
ఓమన్ బ్యాటర్లలో అయాన్ ఖాన్ 2 సిక్సులు, రెండు ఫోర్లతో 36 పరుగులతో చేయగా.. మెహ్రన్ ఖాన్ 16 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సులు బాది 27 పరుగులు వేగంగా సాధించాడు. నలుగురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. 20 ఓవర్లలో 125 పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయి ఓమన్ ఈ మ్యాచ్‌లో ఓడిపోగా.. ఆసీస్ టీ 20 వరల్డ్ కప్‌లో బోణీ కొట్టింది. ఆసీస్ స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్‌ను ఈ మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం చేశారు. డేవిడ్ వార్నర్ 56 పరుగులతో ఫామ్‌ను అందుకోగా.. మార్కస్ స్టోయినిస్ 3 వికెట్లు, 67 పరుగులతో రాణించడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.