ICC T20 World Cup 2024: టీ 20 మ్యాచుల్లో అగ్రశ్రేణి జట్లే గెలవాలనే రూల్ ఏం లేదు. ముఖ్యంగా ఇప్పటివరకు కివీస్, సౌతాఫ్రికా లాంటి జట్లు టీ 20 టైటిట్ ఇంతవరకు గెలవలేవు. అయినా వాటిని తక్కువ అంచనా వేయలేం. విండీస్ ఇప్పటికే రెండు సార్లు టీ 20 వరల్డ్ కప్ గెలిచి అందరి కంటే ముందు వరుసలో ఉంది. టీ 20 క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. వన్డేలు, టెస్టుల మాట అటుంచితే టీ 20లో విండీస్ తో పోరు చాలా కష్టమే.
అఫ్గానిస్తాన్ పేరుకు పసికూన అయినా తమదైన రోజున పెద్ద జట్లను కూడా ఓడించగల సత్తా ఉంది. రషీద్ ఖాన్, నబీ, రహ్మనుల్లా గుర్జాబ్, ముజీబ్ రెహ్మన్, నూర్ అహ్మద్‌లతో పటిష్టంగా కనిపిస్తోంది. వీరితో పాటు బ్యాటింగ్ చేయగల సమర్థులు ఉన్నారు.
బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఒక్క సారి కూడా ఐసీసీ ట్రోపీలు గెలవలేదు. అయినా ఈ జట్టు పెద్ద టీంలను ఓడించగల సత్తా ఉంది. షకీబ్ ఆల్ హసన్, మహ్మదుల్లా, బ్యాటింగ్ లిటాన్ దాస్, హృదోయ్, బౌలింగ్ టాస్కిన్ లాంటి వాళ్లలో భీకరంగా కనిపిస్తోంది. కానీ సరైన ఆటతీరు కనబర్చక అన్ని టోర్నీల్లో గ్రూపు స్టేజీలోనే వెనుదిరుగుతోంది. ఈ సారి మాత్రం కప్ ఎలాగైనా కొట్టాలని కృతనిశ్చయంతో ఉంది.
ఈ టీంలే కాకుండా ఐర్లాండ్, నెదర్లాండ్, నమీబియా, అమెరికా, కెనడా లాంటి టీంలు వచ్చిన అవకాశాల్ని సరైన విధంగా వినియోగించుకోవాలని చూస్తున్నాయి. దీని కోసం ప్రతి ఒక్క టీం శాయశక్తులా పోరాడేందుకు సిద్ధమయ్యాయి. కానీ టైటిల్ రేసులో మాత్రం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా, ఇంగ్లండ్ ఉండగా.. వెస్టిండీస్, సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్‌లు సైతం ఢీ అంటే ఢీ అనడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సారి టీ 20 పోరు మరింత ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.