Team India got a coach?: ఇండియా క్రికెట్ టీంకు కోచ్ పదవి కోసం బీసీసీఐ మే 27 వరకు దరఖాస్తులు తీసుకోనుంది. ఇప్పటికే చాలా మంది అప్లై చేసుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీ 20 వరల్డ్ కప్ ముగియగానే రాహుల్ ద్రవిడ్
పదవి కాలం అయిపోతుంది. అతడి వారసత్వాన్ని కొనసాగించాలంటే ప్రతిభావంతుడైన క్రికెటర్ ఉండాలని బీసీసీఐ సెర్చింగ్ మొదలెట్టింది.
ఇందుకు తగిన వ్యక్తి చెన్నై జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అని భావిస్తున్నట్లు సమాచారం. న్యూజిలాండ్ టీంకు మాజీ కెప్టెన్, చెన్నై టీంను అయిదు సార్లు చాంపియన్‌గా నిలపడంలో ఫ్లెమింగ్ సేవలు మరువలేనివి. దీంతో ఫ్లెమింగ్‌ను బీసీసీఐ పెద్దలు సంప్రదిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. చెన్నై జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తూ ఎంతో మంది టాలెంట్ ఉన్న ప్లేయర్లను ఆడిస్తూ వారికి చాన్స్‌లు ఇచ్చాడు.
న్యూజిలాండ్‌కు ఎక్కవ కాలం కెప్టెన్‌గా చేసి ఎన్నో విజయాలు అందించారు. సరైన సమయంలో ప్లాన్లను ఇంప్లిమెంట్ చేయడంలో ఫ్లెమింగ్ దిట్ట. ఇండియాకు కోచ్‌గా చేయడమంటే మామూలు విషయం కాదు.
దాదాపు కుటుంబానికి 10 నెలలు దూరం ఉండాల్సి వస్తుంది. ఇలా కుటుంబానికి దూరం ఉండటం అంటనే రిటైర్డ్ అయిన క్రికెటర్లకు ఇష్టం ఉండదు. ఇండియా క్రికెట్ కోచ్ రేసులో ఫ్లెమింగ్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ కూడా ఉన్నాడు.
జస్టిన్ లాంగర్ ఎంతో ప్రతిభావంతుడైన క్రికెటర్. మాజీ ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే క్రికెటర్. ఎన్నో మ్యాచుల్లో సంచలన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే లాంగర్ కంటే ఫ్లెమింగ్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లెమింగ్ వైపు మొగ్గు చూపడానికి కారణం అతడి ట్రాక్ రికార్డే అని తెలుస్తోంది. టీం ఇండియాకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదంటే కోచ్ ప్లేయర్లతో కలిసిపోవడం ముఖ్యం. అలాంటి వ్యక్తినే సెలక్ట్ చేయాలని బీసీసీఐ భావిస్తోంది.