Gautham angry with AB de Villiers, Kevin Pietersen: గౌతం గంభీర్ ఆటతోనే కాదు మాటలతో ప్రత్యర్థుల్ని చిత్తు చేయగల సమర్థుడు. ప్రస్తుతం కోల్‌కతా టీంకు మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్‌లో కోల్‌కతా ఇప్పటికే ప్లే ఆఫ్‌కు చేరి టైటిల్ రేసులో ముందంజలో ఉంది. ఎన్నో అంచనాలతో ఈ సారి సీజన్‌లో అడుగుపెట్టిన ముంబయి ఇండియన్స్‌కు మాత్రం కలిసి రాలేదు. ముంబయి ఇండియన్స్ రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే.
ముంబయి జట్టు ఈసీజన్లో 13 మ్యాచుల్లో నాలుగు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది. దీంతో హార్దిక్ పాండ్యాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మాజీ క్రికెటర్లు సైతం హార్దిక్ కెప్టెన్సీపై పెదవి విరిచారు. ముఖ్యంగా సౌతాఫ్రికా బ్యాటర్ మాజీ ఆర్సీబీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ‘హార్దిక్ కెప్టెన్‌గా అందరినీ కలుపుకోలేకపోతున్నాడని.. అతడికి అహం ఎక్కువ’ అని అన్నాడు.
కెవిన్ పీటర్సన్ కూడా హార్దిక్‌కు కెప్టెన్సీ చేయడం రాదని వ్యాఖ్యానించాడు. ఇలా ముంబయి అభిమానులు, మాజీ క్రికెటర్లు అందరూ హార్దిక్‌పై విరుచుకుపడుతున్న వారే. మాజీ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలపై గౌతం గంభీర్ స్పందించాడు. ఏబీడీ, కెవిన్ ఐపీఎల్‌లో మీరేం సాధించారు. ఒక్కసారైనా జట్టుకు కప్ అందించారా.. అని విమర్శించాడు.
హార్దిక్ పాండ్యా గుజరాత్ టీంకు ఎంటరైన మొదటి సంవత్సరమే టైటిల్ అందించాడు. రెండో సీజన్‌లో కూడా టీంను రన్నరప్‌గా నిలిపాడు. మీరు ఏం సాధించకుండానే హార్దిక్‌పై విమర్శలు చేస్తారా.. అసలు మీకు విమర్శలు చేయడానికి కూడా అర్హత లేదని ఘాటుగా స్పందించాడు. హార్దిక్‌ను ఇప్పటి వరకు అందరూ విమర్శించే వారే. కానీ గౌతం గంభీర్ ఒక్కడే హార్దిక్‌ను వెనకేసుకొచ్చాడు. హార్దిక్ లాంటి ప్లేయర్ ఇండియాకు చాలా అవసరం. పేస్ ఆల్ రౌండర్‌గా అతడి సేవలు చాలా ముఖ్యమని అన్నాడు.