Rohit Sharma, IPL 2024: ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ థర్డ్ మ్యాన్ సైడ్ ప్లిక్ షాట్లు కొడుతుంటే రోహిత్ శర్మ టీజ్ చేయడం మైక్‌లో వినిపించింది. దినేశ్ కో దిమాక్ మే కుచ్ చల్ రహే.. వరల్డ్ కప్ సెలక్షన్ కే లియాయే దిమాక్ చల్ రహే అంటూ రోహిత్ శర్మ ఆట పట్టించాడు. అవును దినేశ్ కార్తీక్ ఆట తీరు చూస్తుంటే అదే నిజమనిస్తుంది.
ముంబయితో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి విఫలమైనా.. చివర్లో దినేశ్ కార్తీక్ హాఫ్ సెంచరీతో జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించాడు. అయితే బౌలింగ్‌లో విఫలం కావడంతో ఆర్సీబీ ఓటమి పాలైంది. అయితే వయసు మీద పడుతున్నా.. దినేశ్ కార్తీక్ ఆడిన ఆట చూస్తుంటే ముచ్చటేస్తోందని కామెంటేటర్లతో పాటు ప్రేక్షకులు అభినందిస్తున్నారు.
దినేశ్ కార్తీక్ నిదాహస్ ట్రోఫిలో బంగ్లాదేశ్‌పై ఫైనల్లో చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నారు. మళ్లీ పాత దినేశ్ కార్తీక్ పూనాడా ఏంటీ అని చర్చించుకున్నారు. రిటరై కావాల్సిన వయసులో దినేశ్ ఆడుతున్న షాట్లు చూసి యంగ్ స్టర్స్ నేర్చుకోవాల్సిన అవసరముంది. ప్రాక్టీస్‌తోనే ఇలాంటి షాట్లు ఆడటం సాధ్యమని అందరూ చర్చించుకుంటున్నారు.
మ్యాచ్ మొత్తం వేరు రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు వేరు.. ఏంటీ వరల్డ్ కప్ సెలక్షన్ దినేశ్ మదిలో మెదలు తోంది. అవును వరల్డ్ కప్, వరల్డ్ కప్ అని టీజ్ చేస్తుంటే దినేశ్ చిన్నగా నవ్వు నవ్వాడు. దీనర్థం దినేశ్ కూడా టీ 20 వరల్డ్ కప్‌లో చోటు సంపాదించడం కోసమే ప్రయత్నిస్తున్నాడా? అనేది ఇప్పుడు అసలు విషయంగా మారిపోయింది.
మరి వరల్డ్ కప్ సెలక్షన్లో దినేశ్ కార్తీక్ పేరు కనిపిస్తుందా.. లేక యంగ్ స్టర్స్ కే సెలక్టర్లు మొగ్గు చూపుతారా అనేది మరి కొన్ని రోజుల్లోనే తేలిపోనుంది.