సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ
ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై విజయం
CSK vs SRH, IPL 2024: ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకున్నది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 165 రన్స్ చేసింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. నితీశ్ సిక్సర్ ద్వారా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. మార్‌క్రమ్ (50) పరుగుల వరద పారించాడు.