- రూ.3 కోట్లు మోసం
- పోలీసులకు కంప్లైంట్
- వరుసకు సోదరుడు వైభవ్ పాండ్యాపై ఫిర్యాదు
HARDIK PANDYA: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్డిక్ పాండ్యా(HARDIK PANDYA), లక్నో సూపర్ జెయింట్స్ క్రికెటర్ కృనాల్ పాండ్యా (KRUNAL PANDYA) ఇద్దరు తమకు వరసకు సోదరుడైన వైభవ్ పాండ్యా చేతిలో రూ.3 కోట్లకు పైగా మోసపోయారు. పాండ్యా బ్రదర్స్‌కు స్టెప్ బ్రదర్ అయిన వైభవ్ పాండ్యాతో పాలిమర్ బిజినెస్‌ను 2021లో గుజరాత్‌లోని వడోదరలో ప్రారంభించారు. ఇందులో పాండ్యా బ్రదర్స్‌కు 40 శాతం లాభం, వైభవ్ పాండ్యాకు 20 శాతం లాభాలు తీసుకోవాలని అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.
ముందు లాభాలు.. తరువాత నష్టాలు
అయితే మొదట్లో సరైన విధానంలోనే లాభాలు కేటాయించిన వైభవ్ తర్వాత నుంచి నష్టాలు చూపించడం మొదలెట్టాడు. దీంతో హర్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాకు అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. పాలిమార్ బిజినెస్ ముగ్గురు మధ్యలో ఉండగా.. దాన్ని వైభవ్ పాండ్యా తన సొంతంగా మరోటి పెట్టుకున్నాడు. ఇటు వచ్చే లాభాలను అన్నింటిని తన సొంత బిజినెస్ వైపు మళ్లించుకున్నాడు. ఇలా పాండ్యా బ్రదర్స్‌కు రూ.3 కోట్ల నష్టం మిగిల్చాడు.
మోసంపై పోలీసులకు ఫిర్యాదు
వీరికి రావాల్సిన మూడు కోట్ల రూపాయలు ఇవ్వమని పాండ్యా బ్రదర్స్ అడగ్గా.. వైభవ్ పాండ్యా వారినే బెదిరించారు. ఇండియ క్రికెటర్లు బెదిరిస్తున్నారని మీడియాకు లీకులు ఇస్తానని చీటింగ్ చేశాడు. దీంతో పాండ్యా బ్రదర్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. వైభవ్ పాండ్యా బిజినెస్ పార్ట్‌నర్ మాత్రమే కాకుండా స్టెప్ బ్రదర్ కావడంతో హార్దిక్, కృనాల్ పాండ్యాలు వైభవ్‌ను నమ్మారు. తర్వాత మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
హార్దిక్ క్రికెట్‌పై దృష్టి పెట్టు
అటు ధోని పేరు వాడుకుని ఆర్కా స్పోర్ట్ డైరెక్టర్ జైపూర్‌లో స్పోర్ట్ అకాడమీ పేర రూ.15 కోట్ల మోసంపై కేసు నమోదు కావడం.. కూడా విషయం బయటకు వచ్చింది. దీంతో క్రికెటర్లు వ్యాపారాల్లో మునిగితేలుతున్నారని సగటు క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. హార్దిక్ పాండ్యా క్రికెట్‌పై దృష్టి పెడితే బాగుంటుందని సలహా ఇస్తున్నారు.