IPL 2024, NITISH KUMAR REDDY: ఇండియాలో ఫాస్ట్ బౌలింగ్, బ్యాటింగ్ చేయగల క్రికెటర్లు చాలా తక్కువ మందే ఉన్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కీలక ఆల్ రౌండర్‌గా ఉన్నా.. అతడు ఎప్పుడూ గాయాల బారిన పడుతూ జట్టులో పరిపూర్ణంగా కనిపించడం లేదు. రవీంద్ర జడేజా ఉన్నా.. స్పిన్ ఆల్ రౌండర్‌గానే కొనసాగుతున్నాడు. ఫేస్ ఆల్ రౌండర్ల కోసం భారత జట్టు నిరీక్షిస్తూనే ఉంది. ఆ మధ్యలో వెంకటేశ్ అయ్యర్, శివమ్ దూబె మెరిసినా గాయాల బారిన పడి చోటు పొగోట్టుకున్నారు. వెంకటేశ్ అయ్యర్, శివమ్ దూబెల బౌలింగ్‌లో ఫేస్ ఎక్కువగా ఉండకపోవడంతో ఈజీగా ఆడేస్తున్నారు.
ప్రస్తుతం అందరి చూపు సన్ రైజర్స్ ఆటగాడిపై పడింది. పంజాబ్‌తో మ్యాచ్‌లో 37 బంతుల్లోనే 64 పరుగులు చేసిన నితీశ్ కుమార్ రెడ్డి ఫేస్ బౌలింగ్ చేసి ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో ఇతడు మిగతా సీజన్‌లో రాణిస్తే రాబోయే కాలంలో ఇండియా టీంకు ఆల్ రౌండర్ దొరికినట్లే. స్పిన్ ఆల్ రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవి చంద్రన్ అశ్విన్ ఉన్నా.. ఫేస్ ఆల్ రౌండర్ కొరత టీం ఇండియాను వేధిస్తోంది.
కపిల్ దేవ్ తర్వాత హర్దిక్ పాండ్యాను అతడి వారసుడిగా ఊహించుకున్న సగటు క్రికెట్ అభిమానులకు హార్దిక్ న్యాయం చేయలేకపోతున్నాడు. సరైన సమయంలో గాయాల బారిన పడి జట్టుకు దూరమవుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ చేయగల సమర్థత ఉన్న నితీశ్ కుమార్ రెడ్డిని సానబెడితే ఇండియా క్రికెట్‌కు ఆల్ రౌండర్ కొరత తీరినట్లవుతుంది.
ఇంగ్లాండ్‌లో అండ్రూ ప్లింటప్, సౌతాఫ్రికాకు జాక్వస్ కలిస్, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సాన్, ప్రస్తుతం కెమెరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, ఇలా ఆల్ రౌండర్లుగా అదరగొడుతున్నారు. ఇండియాకు మాత్రం కపిల్ దేవ్ తర్వాత అంతటి స్థాయి ఆటగాడు దొరకలేదు. మధ్యలో రాబిన్ సింగ్ కొన్నేళ్ల పాటు ఆడిన మీడియం ఫేస్ ఆల్ రౌండర్‌గా ఫినిషర్‌గా జట్టుకు సేవలందించాడు. ఈ ఐపీఎల్‌లో తదుపరి మ్యాచుల్లో నితీశ్ బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణిస్తే ఇండియా టీంలో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.