Kohli’s Stunning Run Out: విరాట్ కొహ్లి మరో మెరుపు రనౌట్ చేశాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్ రియాన్ పరాగ్ కొట్టిన షాట్‌కు పరాగ్, ధ్రువ్ జురెల్ రెండో రన్‌కు ప్రయత్నించారు. కెమెరూన్ గ్రీన్ వేసిన 14వ ఓవర్‌లో విరాట్ వేసిన మెరుపు త్రోకు ధ్రువ్ జురెల్ రన్ అవుట్ అయ్యాడు.
దీంతో విరాట్ కొహ్లిని చిరుతతో పోలుస్తున్నారు. చిరుతలా మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేస్తూ ఇప్పటికే ఈ సీజన్‌లో మూడు రనౌట్లు చేశాడు. విరాట్ కొహ్లి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో శశాంక్ సింగ్‌ను ఇదే విధంగా అవుట్ చేసి పంజాబ్‌పై సూపర్ విక్టరీ సాధించడంలో సక్సెస్ అయ్యాడు. మరో సారి గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో షార్‌క్ ఖాన్‌ను రన్ అవుట్ చేసిన విధానం కలిసి వచ్చింది.
దీంతో ఆ మ్యాచులో ఆర్సీబీ విజయం సాధించింది. 36 ఏండ్ల వయసులో తన ఫిట్‌నెస్‌తో పాటు మెరుపులా ఫీల్డిండ్ చేస్తూ ఈ ఐపీఎల్ సీజన్‌లో ముగ్గురిని రనౌట్ చేశాడు. అయితే విరాట్‌ను చూసి యూత్ ఫీల్డింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. విరాట్ కొహ్లి బ్యాటింగ్‌లోనూ సూపర్‌గా ఆడుతున్నాడు. అసలు ఏ మాత్రం ఆశలు లేని స్థితిలో నుంచి ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న ఆర్సీబీ తన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కూడా విరాట్ సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు.
విరాట్ కొహ్లి ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. బ్యాటింగ్‌లో అదరగొట్టే పర్ఫామెన్స్‌తో తన ఆటతీరుతో మరోసారి నిరూపించుకున్నాడు. కానీ తన టీం మెంబర్స్‌లో కెమెరూన్ గ్రీన్, మ్యాక్స్‌వెల్ లాంటి ప్లేయర్లు రాణించకపోవడంతో ఆర్సీబీ ఈ సీజన్‌లో కూడా టైటిల్ గెలవకుండానే ఇంటి బాట పట్టింది.