RCB fans: చెన్నై, ఆర్సీబీ మధ్య బెంగళూరులో జరిగిన కీలకపోరులో ఆర్సీబీ చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. ఆ టీం ఫ్యాన్స్ చెన్నై అభిమానులపై దాడులకు దిగారు. పట్టరాని సంతోషంలో ఎంజాయ్ చేయాల్సిన వారు చెన్నై ఫ్యాన్స్ మీద దాడులు చేశారు. మ్యాచ్ అనంతరం బెంగళూరు చిన్న స్వామి స్టేడియం నుంచి బయటకు వెళుతున్న సీఎస్కే అభిమానులపై ఆర్సీబీ అభిమానులు విచక్షణ మరిచి ప్రవర్తించారు. సీఎస్కే ఎల్లో జెర్సీ వేసుకుని కనిపించిన ప్రతి ఒక్కరిని కొడుతూ, తిడుతూ దుర్భాషలాడుతూ రణరంగం సృష్టించారు. అసలు ప్లే ఆఫ్స్ చేరినంత మాత్రానా ఇంత హంగామా చేస్తారా అని ఇతర టీంల ఫ్యాన్స్ ఆర్సీబీ అభిమానులపై మండిపడుతున్నారు. ఆర్సీబీ ఫ్యాన్స్ మొత్తం రోడ్లపైకి రావడంతో మ్యాచ్ జరిగిన రోజు బెంగళూరులో ట్రాఫిక్ జాం అయిపోయింది.
ఆర్సీబీ ఫ్యాన్స్ ధోని జెర్సీ 7 వేసుకున్న అభిమానిని పరిగెత్తించి కొట్టిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సీఎస్కే ఫ్యాన్స్‌ను స్టేడియం బయట వెంటపడీ మరీ కొట్టడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీశారు. బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలోని స్టాఫ్ కూడా సీఎస్కే అభిమానులు ప్రదర్శిస్తున్న ప్లకార్డులను చేతుల్లోంచి లాగేసుకోవడం.. వారిని దూషిస్తున్న వీడియో సోషల్ మీడియాలో సీఎస్కే అభిమాని పోస్టు చేశాడు.
దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్‌పై సీఎస్కే అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇప్పటివరకు ఒక్క టైటిట్ కూడా గెలవని ఆర్సీబీ కేవలం ప్లే ఆఫ్స్‌కు వెళితేనే ఏంటీ ఈ గోల అని తిట్టిపోస్తున్నారు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ చెన్నైలోనే ఉంది. అక్కడికి వచ్చే ఆర్సీబీ అభిమానులపై తమ ప్రతాపం చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంచితే ఏ మాత్రం ఆశలు లేని స్థితి నుంచి ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరి అందరినీ ఆశ్యర్యపరిచింది. చెన్నై, ఆర్సీబీ మ్యాచులో దాదాపు 90 శాతం చెన్నైకే గెలుపు అవకాశాలు ఉన్నా కూడా ఆర్సీబీ ప్లేయర్స్ సమష్టిగా రాణించి చెన్నైను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.