NED vs NEP Highlights, T20 World Cup 2024: టీ 20 వరల్డ్ కప్‌లో భాగంగా డల్లాస్‌లోని గ్రాండ్ ఫ్రారీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నేపాల్(Nepal)పై నెదర్లాండ్ (Netherlands) టీం బోణీ కొట్టింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో కాస్త చెమటోడ్చాలి వచ్చింది. నెదర్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. నేపాల్ ఓపెనర్లు ఇద్దరు తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. వన్ డౌన్‌లో వచ్చిన అనిల్ సాహు, కెప్టెన్ రోహిత్ పౌడేల్ ఇద్దరు మంచి పార్ట్ నర్ షిప్ కు ట్రై చేస్తుండగా, అనిల్ సాహు అవుటయ్యాడు. రోహిత్ పౌడేల్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. నెదర్లాండ్ బౌలర్లలో టిమ్ ఫ్రింగిల్, వాన్ బీక్ చెరో మూడు వికెట్లు, వాన్ మీకరన్, బాస్ డీ లీడ్ చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో నేపాల్ 20 ఓవర్లు ఆడకుండానే 106 పరుగులకే ఆలౌట్ అయింది.
సెకండ్ ఇన్సింగ్స్‌లో 107 పరుగుల ఛేజింగ్‌తో బరిలోకి దిగి 15 ఓవర్లలోనే ఛేజ్ చేసేసింది. నెట్ రన్‌రేట్ కూడా మెరుగుపర్చుకుంది. ఓపెనర్ మ్యాక్సీ డీడౌట్ 54 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ గెలిపించాడు. విక్రమ్ జిత్ సింగ్ 22 పరుగులు, ఇంగిల్ బ్రీత్ 14, బాస్ డీ లీడ్ 11 పరుగులతో రాణించారు. దీంతో మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే నెదర్లాండ్ టార్గెట్‌ను చేజ్ చేసింది. నేపాల్‌కు అనుభవలేమి కనిపించింది. కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకుని తక్కువ స్కోరుకే పరిమితమైంది. నలుగురు మినహా ఎవరూ డబుల్ డిజిట్ స్కోరు చేయకపోవడంతో 106 పరుగుల స్వల్ప స్కోరు మాత్రమే చేసింది. ఈ పిచ్‌పై 160 పరుగులు చేస్తే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉంటాయి. రాబోయే మ్యాచుల్లో టాప్ టీంలతో ఆడాల్సిన నేపాల్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.