- రికార్డు క్రియేట్ చేసిన యూఎస్ఏ
- పాక్ చెత్త బౌలింగ్, ఫీల్డింగ్‌పై విమర్శలు
USA vs PAK Highlights, T20 World Cup 2024: యూఎస్ఏ (USA) (అమెరికా) టీం పాకిస్థాన్ (Pakistan)పై సూపర్ ఓవర్ (Super Over)లో ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి పాకిస్థాన్ టీంకు భారీ షాక్ ఇచ్చింది. అమెరికా (America), పాకిస్థాన్ మధ్య డల్లాస్‌లోని గ్రాండ్ ఫ్యారీ (Grand Ferry) స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఉత్కంఠ భరిత పోరులో విజయం సాధించింది. గ్రూప్ 1లో ఫస్ట్ ప్లేస్‌లోకి వెళ్లిపోయింది. ఇప్పటికే కెనడాపై గెలిచిన యూఎస్ఏ అంతర్జాతీయ క్రికెట్‌లో టాప్ టీం అయిన పాకిస్థాన్‌పై గెలిచి టోర్నీలో మిగతా జట్లకు హెచ్చరికలు పంపింది.
అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ (Patel) టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోగా.. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిజ్వాన్‌ను అవుటయ్యాడు. 26 పరుగులకే మూడు వికెట్లు పడిపోయిన పాక్‌ను బాబర్ ఆజం (Babar), షాదాబ్ ఖాన్ (Khan) ఆదుకున్నారు. పవర్‌ప్లేలో పాక్ బ్యాటర్లు రన్స్ చేయకుండా యూఎస్ఏ బౌలర్లు కట్టడి చేశారు. యూఎస్ఏ బౌలర్లు కెంజీగి, నేత్రవల్కర్ ఇద్దరు కలిసి ఐదు వికెట్లు తీశారు.
అమెరికా బౌలర్ల పటిష్ట రాణింపు
పాకిస్థాన్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజం 44 పరుగులు చేయగా.. షాదాబ్ ఖాన్ 25 బంతుల్లోనే మూడు సిక్సులు, ఒక ఫోర్‌తో 43 పరుగులు చేసి అవుటయ్యాడు. చివర్లో బౌలర్ షాహీన్ ఆఫ్రిది బ్యాటింగ్ రెండు సిక్సులు, ఒక ఫోర్‌తో 23 పరుగులు, ఇఫ్తికార్ 18 పరుగులు చేయగా.. పాక్ 159 పరుగులు చేసి మొదటి ఇన్సింగ్స్ ముగించింది.
160 పరుగుల ఛేజింగ్‌తో దిగిన అమెరికాకు టేలర్, కెప్టెన్ మోనాంక్ పటేల్ 5 ఓవర్లలో 36 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. టేలర్ 12 పరుగుల వద్ద ఔటయ్యాడు. వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అండ్రూ గౌస్, మోనాంక్ పటేల్‌తో కలిసి సింగిల్స్, డబుల్స్ తీస్తూ పాక్ బౌలర్లకు చిక్కకుండా నెమ్మదిగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు.
అండ్రూ గౌస్ 35, మోనాంక్ పటేల్ 50 పరుగులతో పాక్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. అరోన్ జోన్స్ 36 నితీశ్ కుమార్ 14 పరుగులతో సమయోచితంగా ఆడటంతో యూఎస్ఏ 20వ ఓవర్ చివరి బంతికి మ్యాచ్‌ను టైగా ముగించగా.. చివరకు సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసి 18 పరుగులు చేసింది. సూపర్ ఓవర్‌లో ఆరు పరుగుల తేడాతో పాక్ ఓడిపోయింది.