KL Rahul: లక్నో, సన్ రైజర్స్ మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ అనంతరం లక్నో ఓనర్ సంజయ్ గోయెంకా, కెప్టెన్ రాహుల్ మధ్య జరిగిన సంభాషణపై తీవ్ర స్థాయిలో దుమారం రేగుతోంది. దీంతో లక్నో జట్టు సహాయక కోచ్ లాన్స్ క్లూసెనర్ అదేమంతా పెద్ద విషయం కాదు. కేవలం టీ కప్పులో తుపాన్ లాంటిది. అయినా ఇలాంటి డిస్కషన్స్ జరిగితేనే కదా.. ఎలా ఉండాలి.. ఎలా మ్యాచులు ఆడి మరింత కసిగా గెలవాలన్నది తెలుస్తుందని క్లూసెనర్ అన్నారు.
సంజయ్ గోయెంకా, కేఎల్ రాహుల్ మధ్య జరిగిన సంభాషణను అందరూ చాలా పెద్దది చేసి చూస్తున్నారు. అక్కడ అంత ఏమీ లేదు. టీం ఓడిపోయినపుడు సాధారణంగా జరిగే సంభాషణే అది.. కానీ మీడియా ముందు జరిగే సరికి ఏదో అయిపోయినట్లు భావిస్తున్నారు. ఇలాంటివి కామన్ అంటూ కొట్టిపారేశాడు.
కాగా లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ నెక్ట్స్ సీజన్లో లక్నోకు ఆడకూదడని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్రాంచైజీ మారాలని డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది. కాగా ఈ సీజన్లో ఇప్పటికే ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉండగా.. లక్నోకు ఇంకా ప్లే ఆఫ్స్‌కు వెళ్లే చాన్స్ ఉంది. కానీ ఈ విభేదాల వల్ల జట్టు ఎలా ఆడుతుందోనని టీం యాజమాన్యం సందేహం వ్యక్తం చేస్తుంది.
సోషల్ మీడియా, క్రికెట్ అభిమానులు, ఇతర మాజీ ప్లేయర్లు, కామెంటేటర్లు, క్రికెట్ ఎక్స్పర్ట్స్ మాత్రం ప్రాంచైజీ ఓనర్ ఓ ఇండియా క్రికెటర్‌పై ఇలా దురుసుగా ప్రవర్తించడం దారుణమని మండిపడుతున్నారు. అయినా ఇప్పటి వరకు సంజయ్ గోయెంకా నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇప్పటి వరకు పంజాబ్ అన్ని సీజన్లలో ఓడిపోతున్న కూడా ప్రీతి జింటా ఎక్కడా కూడా తన అసహనాన్ని వ్యక్తం చేయలేదని పోస్టులు పెడుతున్నారు. హుందాతనాన్ని ప్రీతి జింటా నుంచి నేర్చుకోవాలని గోయెంకాకు సూచిస్తున్నారు.