మన బలగం, స్పోర్ట్స్ డెస్క్
Deepak Char, IPL 2024 : చెన్నై సూపర్ కింగ్స్‌ను గాయాల బెడద వేధిస్తోంది. చెన్నై బౌలర్ దీపక్ చాహర్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు బంతులు మాత్రమే వేసి గ్రౌండ్‌ను వదిలి బయటకు వెళ్లిపోయాడు. చెన్నై ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 10 మ్యాచులు ఆడి కేవలం అయిందిట్లోనే గెలిచింది. ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు దీపక్ చాహర్ గాయంతో దూరమయ్యాడు. తిరిగి మళ్లీ గాయం కావడంతో చెన్నై టీంకు ప్రధాన బౌలర్ లేని లోటు కనిపిస్తోంది. చీలమండ గాయంతో 2022 సీజన్‌లో ఐపీఎల్‌తో పాటు టీ 20 వరల్డ్ కప్ జట్టులో చోటు కోల్పోయిన దీపక్ చాహర్ మళ్లీ గాయంతో గ్రౌండ్‌ను వీడటంతో అతడి ఫిట్ నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి.
దీపక్ చాహర్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. మంచి ఆల్ రౌండర్ కాగల ప్రతిభ ఉన్న ఆటగాడు. కానీ దీపక్ గాయాల బారిన పడటంతో అతడి కెరీర్ ముందుకు సాగడం లేదు. రెండేళ్లుగా టీం ఇండియా జట్టుకు దూరమయ్యాడు. ఇలా ప్రతిసారి ఏదో గాయం చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నాడు. జట్టుకు భారంగా మారుతున్నాడు. ఇప్పటి వరకు దీపక్ చాహర్ ఈ ఐపీఎల్ సీజన్‌లో నాలుగు మ్యాచులు ఆడి కేవలం 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. ప్రస్తుతం బౌలింగ్‌లో కూడా పెద్దగా ఫామ్‌లో లేడు.
రెండు బంతులు వేసి దీపక్ చాహర్ బయటకు వెళ్లగా శార్దూల్ ఠాకూర్ తో రుతురాజ్ గైక్వాడ్ మిగిలిన నాలుగు బంతులు వేయించాడు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై బ్యాటర్లు విఫలం కాగా కేవలం 162 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బ్యాటర్లు జానీ బెయిర్ స్టో, మిగతా బ్యాటర్లు సరిగా ఆడటంతో పంజాబ్ ఈజీగా గెలిచింది. ఈ మ్యాచులో ఓడిపోయిన చెన్నై పాయింట్ల టేబుల్స్ లో నాలుగో స్థానానికి పడిపోగా.. పంజాబ్ ఒక స్థానం మెరుగుపరుచుకుని ఏడో స్థానంలోకి వచ్చింది.