Harsha Patel, IPL 2024: యుజ్వేంద్ర చాహాల్ ఇండియా టీంలో లెగ్ స్పిన్నర్ కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ పాపులర్ అవుతున్నాడు. అతడు చేసే ఫన్నీ కామెంట్స్, ఇతర టీం మెంబర్స్‌తో చేసిన ఇంటర్వ్యూలు ఫేమస్ అయ్యాయి. చాహాల్ భార్య ధనశ్రీ కూడా యూట్యూబర్ అండ్ కొరియోగ్రాఫర్ కావడంతో అనేక సార్లు డ్యాన్స్ వీడియోలతో అదరగొట్టేవారు. దీంతో ఇద్దరు చేసే రీల్స్‌తో ఫ్యాన్స్‌కు ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేవారు.
తాజాగా ఐపీఎల్లో రాణిస్తున్న యుజ్జీ చాహల్ వచ్చే నెలలో అమెరికా, వెస్టిండీస్‌లో జరగనున్న టీ 20 వరల్డ్ కప్ టీంకు సెలెక్ట్ అయ్యాడు. గత సారి జరిగిన వరల్డ్ కప్ టీంలో చోటు కోల్పోయిన చాహల్ ఈ సారి రాజస్థాన్ రాయల్స్ తరఫున వికెట్లు తీస్తూ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో టీం ఇండియాకు సెలెక్ట్ అయి మొదటి సారి వరల్డ్ కప్ టీంలో పాల్గొననున్నాడు.
ప్రస్తుతం చాహల్ ఎలన్ మాస్క్‌కు చేసిన కంప్లైంట్ నవ్వులు తెప్పిస్తోంది. చాహల్ కొన్ని సార్లు వికెట్ పడ్డప్పుడు ప్రత్యేక మైన ఫోజులు పెడుతుంటాడు. దీంతో చాహల్ స్టైల్ అనే పేరు వచ్చింది. అయితే పంజాబ్ ఆటగాడు హర్షల్ పటేల్ ఇదే విధంగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో స్టిల్ ఇచ్చాడు. చెన్నై బ్యాటర్ సమీర్ రిజ్వీ ఇచ్చిన క్యాచ్ అందుకున్న హర్షల్ పటేల్ గ్రౌండ్లో చాహల్ చేసుకున్నట్లే సెలబ్రేషన్ చేసుకున్నాడు.
దీంతో చాహల్ ఎలెన్ మస్క్ భాయ్.. ప్లీజ్ హర్షల్ పటేల్నా స్టైల్‌ను కాపీ కొట్టాడు. దాన్ని కాపీ కొట్టడమే కాకుండా ఎక్స్ ట్విటర్లో పెట్టాడు. జర ఆయనపై చర్యలు తీసుకోండని ఫన్నీగా కంప్లైంట్ చేశాడు. దీంతో చాహల్ చేసిన పనికి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. అరే చాహల్ భాయ్ నీకున్న ఒకే ఒక స్టిల్‌ను హర్షల్ ఇలా లాగేసుకోవడం ఎంట్రా అంటూ కామెంట్లు చేస్తున్నాడు. కొంతమంది పోతే పోనీ మన స్టైలే కదా అన్న హర్షల్ పటేల్ కూడా మనోడే అంటూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.