T20 Memorable moments: టీ 20 వరల్డ్ కప్ మ్యాచుల్లో అభిమానులకు కొన్ని ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్సింగ్స్‌లు, చమక్కులు చూసేద్దాం. సురేశ్ రైనా 60 బంతుల్లోనే 100 పరుగులు చేసి ఫస్ట్ టీ 20 సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 2010లో వెస్టిండీస్‌లో సెయింట్ లూయిస్‌లో జరిగిన మ్యాచ్‌లో రైనా ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో 14 రన్స్ తేడాతో విజయం సాధించింది.
రవి చంద్రన్ అశ్విన్ ఇండియా, దక్షిణాఫ్రికా టీ 20 మ్యాచ్‌లో 2014లో 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అప్పటి వరకు డుప్లెసిస్, హషీమ్ హమ్లా చెలరేగి బ్యాటింగ్ చేస్తుండగా.. రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్‌తో గెలిపించాడు.
ఇండియా, బంగ్లాదేశ్ 2016లో జరిగిన టీ 20 మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో మూడు బంతులకు రెండు పరుగులు చేయాల్సిన దశలో హర్దిక్ పాండ్యా మ్యాజిక్ బౌలింగ్, ధోని రనౌట్‌తో ఒక పరుగు తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి శభాష్ అనిపించింది. 15 యార్డ్స్ దూరం నుంచి పరుగెత్తుకుని వచ్చి ధోని చేసిన రనౌట్ నభూతో నభవిష్యత్తు.
2014 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో 44 బంతుల్లోనే విరాట్ 72 పరుగులు చేసి సౌతాఫ్రికాపై ఉత్కంఠ భరిత పోరులో విజయం సాధించేలా చేసి టీమ్‌ను ఫైనల్ చేర్చాడు. మొహలీలో కూడా విరాట్ కొహ్లి ఆస్ట్రేలియాపై 53 బంతుల్లోనే 83 పరుగులు చేసి భారత్‌ను సెమీస్‌కు చేర్చాడు. యువరాజ్ ఆరు సిక్సులు, శ్రీశాంత్ పట్టిన వరల్డ్ కప్ టైటిల్ క్యాచ్. ఆర్పీ సింగ్ బౌలింగ్ మెరుపులు, గౌతం గంభీర్ సీరియస్ ఇన్సింగ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని అద్భుతాలే.. ఒక్కోటి ఒక్కో తురుపు ముక్కలా కనిపిస్తుంది.