sunil narine
sunil narine

Sunil Narine, IPL 2024: సునీల్ నరైన్ కాస్త నవ్వవయ్యా బాబు

Sunil Narine, IPL 2024: సునీల్ నరైన్ వెస్టిండీస్ ఆల్ రౌండర్. ఒకప్పుడు ప్రధాన స్పిన్ బౌలర్‌గా మ్యాచ్‌లు ఆడేవాడు. ప్రస్తుతం కోల్‌కతా తరఫున బ్యాటింగ్‌లో ఓపెనింగ్‌లో దిగుతూ ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటికే అత్యధిక రన్స్ చేసిన వారిలో మూడో స్థానంలో నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటికే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరడం దాదాపు కన్ఫాం అయిపోయింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ టీంలోని సభ్యులు సోషల్ మీడియాలో మాట్లాడిన వీడియో పోస్టు చేసింది. ఇందులో సునీల్ నరైన్ గురించి ఆసక్తికర విషయాలను తోటి టీం మెంబర్స్ పంచుకున్నారు. వెస్టిండీస్ టీం మేట్ అండ్రీ రస్సెల్, నరైన్ గురించి వ్యాఖ్యానిస్తూ అతడు దాదాపు 500 మ్యాచ్‌లకు పైగా ఆడాడు. అతడికి మనం చెప్పాల్సిన పని లేదు. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం ఎక్స్‌పీరియన్స్‌తో వస్తుందన్నాడు.

నరైన్‌లో ఇద్దరు ఆటగాళ్లను చూడొచ్చని అత్యంత ప్రతిభావంతమైన ఆటగాడని పిల్ సాల్ట్ కొనియాడాడు. ఫిల్ సాల్ట్ నరైన్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తున్నాడు. ఇద్దరు కలిసి ప్రత్యర్థి టీం బౌలింగ్ విభాగంపై విరుచుకుపడుతున్నారు. నరైన్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చని అన్నాడు. టీం ఇండియా యంగ్ ప్లేయర్ రఘువంశీ నరైన్ డగౌట్‌లో ఒక రకంగా ఉంటాడు. మిగతా చోట్ల మరో రకంగా ఉంటాడు. డగౌట్‌లో నవ్వుతూ మాట్లాడతాడు. కానీ గ్రౌండ్‌లోకి వెళ్లే సరికి సీరియస్ నెస్ వచ్చేస్తుంది. అని రఘువంశీ నరైన్ గురించి బోలెడన్నీవివరాలు చెప్పారు.

కోల్‌కతాకు ఈ ఏడాది మళ్లీ మెంటర్‌గా గౌతం గంభీర్ బాధ్యతలు తీసుకున్నాడు. అప్పటి నుంచి టీంలో పాజిటివ్ నెస్ పెరిగి విజయాలపై ఫోకస్ పెట్టారు. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని కృత నిశ్చయంతో ఉన్నారు. టీం కూడా బౌలింగ్, బ్యాటింగ్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ పాయింట్స్ టేబుల్స్‌లో మొదటి స్థానంలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *